Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: చెలరేగిన విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్.. విండీస్ ముందు భారీ లక్ష్యం!

IND vs WI: Rishabh Pant, Venkatesh Iyer helps India Set To target 187

కోల్‌కతా: విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), రిషభ్ పంత్(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. పంత్, అయ్యర్ ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్ తలో వికెట్ తీశారు.

ఓపెనర్లు విఫలం..

ఓపెనర్లు విఫలం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. షెల్డన్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(2) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే కాట్రెల్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బ్రాండన్ కింగ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రోహిత్ బౌండరీలు బాదాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 6వ ఓవర్‌లో కోహ్లీ రెండు బౌండరీలు బాదగా.. రోహిత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టానికి 49 రన్స్ చేసింది. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గగా.. చేస్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(19) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

విరాట్ హాఫ్ సెంచరీ..

క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో జోరు కనబర్చినా.. ఔటవ్వడానికి ఎంతో సేపు పట్టలేదు. చేజ్ బౌలింగ్‌లో సూర్య(8) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన పంత్.. వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. రోస్టన్ చేజ్.. వేసిన 14వ ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మార్చిన విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే బౌండరీ లైన్ వద్ద జాసన్ హోల్డర్ ఈ క్యాచ్ వదిలేయడంతో విరాట్ కోహ్లీకి లైఫ్ రావడంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పంత్, అయ్యర్ జోరు..

ఆ తర్వాత వెకంటేశ్ అయ్యర్.. వచ్చిరావడంతో బౌండరీ బాదాడు. మరోవైపు కీరన్ పొలార్డ్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదగా... కాట్రెల్ వేసిన మరుసటి ఓవర్‌లో అయ్యర్ రెండు బౌండరీలు కొట్టాడు. ఇక కాట్రెల్ వేసిన వైడ్ బాల్‌ను లెగ్ సైడ్ కొట్టిన వెంకటేశ్.. భారత డగౌట్‌లోని ఆటగాళ్లను చెల్లా చెదురు చేశాడు. పంత్ మరో బౌండరీ బాదడంతో ఈ ఓవర్‌లో 15 రన్స్ వచ్చాయి.

సింగిల్ హ్యాండ్ సిక్స్..

జాసన్ హోలర్డ్ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన అయ్యర్.. షేఫర్డ్ బౌలింగ్‌లో ఓ బౌండరీ బాదాడు. హోలర్డ్ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతిని సింగిల్ హ్యాండ్‌తో పంత్ కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక రొమారియా షెఫెర్డ్ వేసిన ఆఖరి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ ఔటవ్వడంతో ఐదో వికెట్‌కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే పంత్ క్విక్ డబుల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Friday, February 18, 2022, 20:55 [IST]
Other articles published on Feb 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+