For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: జడేజా చేసిన ఆ పనితో ఇన్‌స్టాలో నవ్వులే నవ్వుల్! (వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానుల క్రియేటివ్ కూడా తోడవ్వడంతో నవ్వులు పూయిస్తోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో రవీంద్ర జడేజా మూడు కీలక వికెట్లు తీశాడు.

సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్‌తో జర్మెన్ బ్లాక్‌వుడ్(14)ను పెవిలియన్ చేర్చిన జడేజా.. తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ క్యాచ్‌పై అంపైర్లు సమీక్ష కోరగా.. థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలిస్తున్నాడు. అందరూ అది క్లియర్ క్యాచా? కాదా? అని టెన్షన్‌ పడ్డారు. క్లియర్ క్యాచ్ అని తేలడంతో సంతోషపడ్డారు.

IND vs WI: Ravindra Jadeja makes umpire wait with epic moment in unmissable video goes viral

జడేజా మాత్రం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. మరసటి బంతి వేసే ముందు మధ్యలో ఆగిన జడేజా గాగుల్స్ తీసి అందులో తన ముఖాన్ని చూసుకుంటూ జుట్టును సరిచేసుకున్నాడు. ఆ తర్వాత బంతిని వేసాడు. ఇక జడేజా జుట్టు సరిచేసుకునేంత వరకు అంపైర్ కూడా వేచి చూడటం గమనార్హం.

ఈ వీడియోను కొందరు అభిమానులు 'దీ బాయ్స్'పేరిట మీమ్ క్రియేట్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలవగా.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 113 ఓవర్లలో 2 వికెట్లకు 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం162 పరుగులకు చేరుకుంది. యశస్వీ జైస్వాల్‌(350 బంతుల్లో 14 ఫోర్లతో 143 బ్యాటింగ్)తో పాటు విరాట్ కోహ్లీ(36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ(221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(6) విఫలమయ్యాడు.

ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ దక్కింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతనాజే(47) మినహా అంతా విఫలమయ్యారు.

పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తే విండీస్ ముందు భారీ లక్ష్యం నమోదు అవుతోంది. నాలుగో రోజు ఆటలో వెస్టిండీస్‌ను ఆలౌట్ చేస్తే విండీస్ విజయం ఖాయమవుతోంది.

Story first published: Friday, July 14, 2023, 16:56 [IST]
Other articles published on Jul 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+