Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: రుతురాజ్‌కు మళ్లీ నిరాశే.. రవి బిష్ణోయ్ అరంగేట్రం! విండీస్‌దే బ్యాటింగ్!

 Ravi Bishnoi makes debut

కోల్‌కతా: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక్కడ ఎప్పుడూ ఆడిన విభిన్న పరిస్థితులు ఎదురయ్యాయన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతో చేజింగ్‌కు మొగ్గు చూపానని చెప్పాడు. ఆస్ట్రేలియా మాదిరి జట్టుగా మరింత బలంగా తయారు కావాలనుకుంటున్నామని తెలిపాడు.

టీమ్‌గా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉందన్నాడు. వెస్టిండీస్ వంటి బీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుతో ఆడటం మాకు గొప్ప అవకాశమని, ఆ జట్టు ఎప్పుడూ సవాళ్లను విసురుతుందని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తాము ఐదుగు బ్యాటర్లు, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. యుజ్వేంద్ర చాహల్‌తో పాటు అరంగేట్ర ప్లేయర్ రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటాడన్నాడు. ఇషాన్ కిషన్ తనతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని చెప్పాడు. దాంతో టాలెంటెడ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. గత సీజన్ ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియా పిలుపు అందుకున్న అతను.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.

సౌతాఫ్రికా పర్యటనలో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన రుతురాజ్.. కనీసం వెస్టిండీస్‌తోనైనా ఆడుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇక తామ బ్యాటింగ్, బౌలింగ్ ఏదైనా చేయగలమని విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తెలిపాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. ప్రాక్టీస్‌లో గాయపడటంతో జాసన్ హోల్డర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అతని స్థానంలో రోస్టెన్ చేజ్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌కు సరిగ్గా 8 నెలలే మిగిలి ఉండటంతో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఆ టోర్నీ కోసం సరైన కాంబినేషన్స్ సెట్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్‌తోనే తమ ప్రణాళికలను ప్రారంభించనుంది.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్

వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), రోవమన్ పొవెల్, రోస్టన్ చేజ్, రొమారియో షెఫెర్డ్, ఫాబియన్ అలెన్, ఓడియన్ స్మిత్, అకీల్ హోస్సెన్, షెల్డన్ కాట్రెల్

Story first published: Wednesday, February 16, 2022, 18:56 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+