Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: నికోలస్ పూరన్ చెలరేగినా.. భారత్ ముందు ఈజీ టార్గేట్!

IND vs WI: Ravi Bishnoi, Harshal Patel restrict West Indies to 157/7

కోల్‌కతా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో మెరిసినా.. భారత్‌ ముందు 158 పరుగుల స్వల్ప లక్ష్యమే నమోదైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత అరంగేట్ర స్పిన్నర్ రవి బిష్ణోయ్(2/17), హర్షల్ పటేల్(2/37) కట్టడిగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ వీరులు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. విండీస్‌లో పూరన్‌కు తోడుగా పోలార్డ్(24 నాటౌట్), కైల్ మేయర్స్(34) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

భువీ శుభారంభం..

భువీ శుభారంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఫస్ట్ ఓవర్‌లోనే భువనేశ్వర్‌ కుమార్ షాకిచ్చాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్‌(4)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన పూరన్‌తో కలిసి కైల్ మేయర్స్ ధాటిగా ఆడాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మేయర్స్ రెండు బౌండరీలు బాదగా.. పూరన్ భారీ సిక్సర్‌తో హిట్టింగ్ మొదలెట్టాడు. దాంతో పవర్ ప్లేలో విండీస్ వికెట్ నష్టానికి 44 రన్స్ చేసింది.

బచాయించిన పూరన్

అయితే పవర్ ప్లే అనంతరం యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. తొలి బంతికే నికోలస్ పూరన్ బచాయించినా.. అదే ఓవర్‌లో కైల్ మేయర్స్(31)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. రోస్టన్ చేజ్(4) ఎల్బీగా పెవిలియన్ చేర్చిన బిష్ణోయ్.. రోమన్ పోవెల్(2)ను క్యాచ్ ఔట్ చేశాడు.

IND vs WI 1st T20 : IPL కుర్రాళ్ళ జోరు India Lead Series 1-0 |Ravi Bishnoi | Oneindia Telugu

పూరన్ హాఫ్ సెంచరీ..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అకీలా హుస్సెన్‌తో పూరన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే సిక్సర్‌తో దూకుడు కనబర్చిన అకీలా హుస్సెన్‌ను దీపక్ చాహర్.. సూపర్ బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. బౌన్సర్‌ను అంచనా వేయంలో విఫలమైన హుస్సెన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి పొలార్డ్ రాగా.. నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. చాహల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదిన పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన పూరన్.. చివరకు క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన పొలార్డ్ 12 పరుగులు పిండుకోగా.. చివరి ఓవర్‌లో కట్టడిగా బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Wednesday, February 16, 2022, 21:44 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+