Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI:రవి బిష్ణోయ్ అత్యుత్సాహం.. సింపుల్ క్యాచ్ కాస్త సిక్స్‌‌గా మారింది! (వీడియో)

IND vs WI: Ravi Bishnoi Converts Poorans Simple Catch As Six Video

కోల్‌కతా: టీమిండియా అరంగేట్ర ప్లేయర్ రవి బిష్ణోయ్ అత్యుత్సాహం కారణంగా వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ బతికిపోయాడు. బౌండరీ లైన్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న రవి బిష్ణోయ్.. అత్యుత్సాహానికి పోయి తీరని నష్టాన్ని మిగిల్చాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 ద్వారా రవి బిష్ణోయ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఇక యుజ్వేంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో నికోలస్ పూరన్‌కు లైఫ్ లభించింది. చాహల్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను పూరన్ భారీ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి లాంగాన్‌లో ఉన్న రవి బిష్ణోయ్ చేతిలో పడింది. అయితే క్యాచ్ అందుకున్న ఆనందంలో వెనక్కివెళ్లిన బిష్ణోయ్ బౌండరీ రోప్‌ను తొక్కేసాడు. దాంతో సింపుల్ క్యాచ్ కాస్త సిక్స్‌గా మారగా.. డేంజరస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వాస్తవానికి రవి బిష్ణోయ్ సూపర్ ఫీల్డర్. మైదానంలో చాలా చురుకుగా ఉంటాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన డైవ్ క్యాచ్‌లు అందుకున్నాడు. కానీ ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న ఉత్సాహం ఎక్కువై ఈ తప్పిదం చేసేలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇకఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కీరన్ పోలార్డ్(24 నాటౌట్), కైల్ మేయర్స్(34) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ రవి బిష్ణోయ్(2/17), హర్షల్ పటేల్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 18.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 162 పరుగులు చేసి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40)ధాటిగా ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), వెంకటేశ్ అయ్యర్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Wednesday, February 16, 2022, 23:06 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+