Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఆట మొదలవ్వకముందే టాప్‌లేపిన అశ్విన్!

దుబాయ్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ టాప్‌ లేపాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందే ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో అశ్విన్ ఫస్ట్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

860 రేటింగ్ పాయింట్స్‌తో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరికీ 32 రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా ఉన్నాయి. కగిసో రబడా, జేమ్స్ అండర్సన్, షాహిన్ అఫ్రిది టాప్-5లో ఉన్నారు. యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్టువర్ట్ బ్రాడ్ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు.

IND vs WI:

అశ్విన్ తర్వాత భారత్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా 9, 10వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకులో నిలవగా.. బాబర్ ఆజామ్ మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ రెండేసి స్థానాలు దిగజారి 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. జో రూట్ సైతం ఒక్క స్థానం దిగజారి టాప్-5‌లో చోటు కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి టాప్-10లో ఒక్క రిషభ్ పంత్ మాత్రమే ఉన్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా టాప్‌లో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ముగిసేసరికి టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ర్యాంకులు సాధించనున్నారు.

Story first published: Wednesday, July 12, 2023, 16:49 [IST]
Other articles published on Jul 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+