బాగా ఆడుతున్నా.. ఆ ఒక్క సమస్యే మా పతనాన్ని శాసిస్తోంది: నికోలస్ పూరన్

పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులిస్తుండటంతోనే విజయాలందుకోలేకపోతున్నామని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అన్నాడు. అన్ని విభాగాల్లో రాణిస్తున్నా ఆ ఒక్క విషయంలో మాత్రం తడబడుతున్నామని చెప్పాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో క్లీస్ స్వీప్ అయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. విధ్వంసకర లైనప్ కలిగిన భారత జట్టు ముందు విండీస్ బౌలర్లు తేలిపోయారు. వన్డే సిరీస్‌లో గట్టి పోటీనిచ్చిన వెస్టిండీస్ తమకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా గత శుక్రవారం జరిగిన తొలి టీ20లో డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చారు. చివరి 4 ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నారు.

ధారళంగా పరుగులిచ్చి..
19వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ 21 పరుగులు ఇస్తే.. ఆఖరి ఓవర్లో ఒబెడ్ మెకాయ్ 15 పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వరుసగా 1,0,6,4,0,4 చెలరేగాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన 190 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 122 పరుగులకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. ఫలితంగా 68 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

మా ఆటగాళ్లది చెత్త ప్రదర్శన..
ఇక ఇరు జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టీ20 ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పూరన్ జట్టు ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు.'గత కొంతకాలంగా మా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా ప్రదర్శన బాగుండటం లేదు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం.' అని చెప్పుకొచ్చాడు. లోపాలు సరిచేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.

పూరన్ కెప్టెన్సీలో అన్నీ ఓటములే..
కీరన్ పొలార్డ్ తప్పుకోవడంతో అతని నుంచి వెస్టిండీస్ పరిమితో ఓవర్ల జట్టు పగ్గాలను పూరన్ అందుకున్నాడు. నెదర్లాండ్స్ పర్యటనలో 3-0తో వన్డే సిరీస్ గెలిచిన అతనికి పాకిస్థాన్ టూర్‌లో ఘోర పరాభవం ఎదురైంది. వన్డే సిరీస్‌లో పాక్ చేతిలో పూరన్ బృందం 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్‌లో బంగ్లా చేతిలో సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. మొదటి రెండు వన్డేల్లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో ఓటమికి తలవంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications