Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: నికోలస్ పూరన్ విధ్వంసం.. ‘మా వాడు’అంటూ సంతోషపడుతున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్!

IND vs WI: Nicholas Pooran In 1st T20 Makes All Sunrisers Hyderabad Fans Happy

హైదరాబాద్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ మరోసారి తన సత్తా ఏంటో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. భారత్‌తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకే సాధ్యమైన సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన పూరన్.. ధాటిగా ఆడే క్రమంలో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.

రూ.10.75 కోట్లు..

అయితే నికోలస్ పూరన్ సూపర్ ఇన్నింగ్స్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో ఈ విండీస్ వీరుడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే గత రెండు సీజన్లుగా పూరన్ దారుణంగా విఫలమవ్వగా.. అతనిపై సన్‌రైజర్స్ ఇంత భారీ మొత్తం చెల్లించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇది బుద్ది తక్కువ నిర్ణయమంటూ ఆ జట్టు అభిమానులు టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతోషంలో సన్‌రైజర్స్..

పూరన్‌లో ప్రతిభకు లోటు లేకున్నా.. నిలకడగా ఆడలేడని, అతన్ని అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. టీమ్ ఓనర్ కావ్య మారన్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్‌ను కూడా ఘోరంగా ట్రోల్ చేశారు. పంజాబ్ కింగ్స్ ఇదే కారణంతో అతన్ని వదులుకుందని, కానీ సన్‌రైజర్స్ ఆలోచన లేకుండా కొనుగోలు చేసిందని విమర్శించారు. కానీ పూరన్.. భారత జట్టుతోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్‌లో కూడా..

సూపర్ బ్యాటింగ్‌తో ఆశలు రేపాడని కామెంట్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే చాలని కామెంట్ చేస్తున్నారు. పూరన్‌ను తీసుకోవడాన్ని తప్పుబట్టిన వారే అతన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నికోలస్ పూరన్ ట్యాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ .. పూరన్‌ను తీసుకోని మంచి పని చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈజీ టార్గెట్..

నికోలస్ పూరన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో మెరిసినా.. భారత్‌ ముందు 158 పరుగుల స్వల్ప లక్ష్యమే నమోదైంది. భారత అరంగేట్ర స్పిన్నర్ రవి బిష్ణోయ్(2/17), హర్షల్ పటేల్(2/37) కట్టడిగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పూరన్‌కు తోడుగా పోలార్డ్(24 నాటౌట్), కైల్ మేయర్స్(34) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.

Story first published: Wednesday, February 16, 2022, 22:20 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+