గయానా: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో నికోలస్ పూరన్.. అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించాడనే అభియోగాలతో భారీ జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది.
అంపైర్ల ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ.. నికోలస్ పూరన్ ఐసీసీ నిబంధనల్లోనీ లెవెల్ 1 తప్పిదం చేశాడని గుర్తించి చర్యలు తీసుకున్నాడు. అతని మ్యాచ్ ఫిజులో 15 శాతం కోత విధించడంతో పాటు నిబంధనల ప్రకారం ఓ డీమెరిట్ పాయింట్ విధించాడు. మ్యాచ్ రిఫరీ ముందు నికోలస్ పూరన్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

'నికోలస్ పూరన్.. ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 2.7ను ఉల్లంఘించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగా విమర్శించడం లెవెల్ 1 నేరం. పూరన్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అనవసరం. నిబంధనల ప్రకారం మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించాడు.'అని ఐసీసీ పేర్కొంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ప్లేయర్ ఏడాది కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందితే రెండు వైట్‌బాల్ గేమ్స్‌తో పాటు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఇక వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన నికోలస్ పూరన్ రివ్యూ తీసుకొని ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా ఔటివ్వడంతో పూరన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో అంపైర్‌ను దూషించాడు.
మ్యాచ్ అనంతరం పూరన్‌పై అంపైర్లు మ్యాచ్ రిఫరికీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో నికోలస్ పూరన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం జరగనుంది.