Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: సిరాజ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

డొమినికా: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సింగిల్ హ్యాండ్‌తో సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు జెర్మైన్ బ్లాక్‌వుడ్(14) పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసాధారణ క్యాచ్ అందుకున్నాడని ప్రశంసిస్తున్నాడు. తొలి రోజు ఆట‌ ఫస్ట్ సెషన్ చివరి ఓవర్ లాస్ట్ బాల్‌కు బ్లాక్‌వుడ్ వెనుదిరిగాడు. జడేజా వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌ను బ్లాక్ వుడ్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.

Mohammed Siraj

కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ పట్టుకునే క్రమంలో సిరాజ్ మోచేతికి గీసుకుపోయింది. నొప్పితో సిరాజ్ ఇబ్బంది పడినా.. క్యాచ్ పట్టాననే సంతోషంతో ఎగిరి గంతేసాడు. ఈ వికెట్‌తో ఫస్ట్ సెషన్ ముగియగా.. వెస్టిండీస్ 68/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు అశ్విన్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఓపెనర్లు తేజ్‌నరైన్ చంద్రపాల్(12) క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్.. క్రైగ్ బ్రాత్‌వైట్(2)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే రేయ్‌మన్ రైఫర్(2)ను ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. అనంతరం సిరాజ్ సూపర్ క్యాచ్‌తో బ్లాక్ వుడ్ వెనుదిరగ్గాడు.

రెండో సెషన్ ఆరంభంలోనే జోషువా డిసిల్వా(2)ను జడేజా ఔట్ చేశాడు. దాంతో విండీస్ 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి జాసన్ హోల్డర్ రాగా.. అరంగేట్ర ప్లేయర్ అలిక్ అథానాజ్(19 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్‌తో ఇషాన్ కిషన్‌, యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. కోహ్లీ చేతుల మీదుగా ఇషాన్.. రోహిత్ చేతుల మీదుగా యశస్వీ అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు. కేఎస్ భరత్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ మూడో పేసర్‌గా జయదేవ్ ఉనాద్కత్‌కు అవకాశం ఇచ్చింది.

Story first published: Wednesday, July 12, 2023, 22:40 [IST]
Other articles published on Jul 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+