డొమినికా: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. వికెట్ కీపర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో విండీస్ బ్యాటర్ రెయ్‌మాన్ రేమాన్ రైఫర్(2)ను పెవిలియన్ చేర్చాడు.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఇషాన్ కిషన్‌ను ప్రశంసిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని శార్దూల్ ఠాకూర్ మూడో స్టంప్ దిశగా వేయగా.. రెయ్‌మాన్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి లో క్యాచ్‌గా కీపర్ వైపు దూసుకెళ్లింది.

సూపర్ డైవ్‌తో ఇషాన్ కిషన్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకిందా? లేదా? అనేది స్పష్టంగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. రీప్లేలను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ కింద ఉండటం గుర్తించి ఔటిచ్చాడు.
అదిరిపోయే క్యాచ్‌తో ఇషాన్ కిషన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి సెషన్ ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు తేజ్‌నరైన్ చంద్రపాల్(12), క్రైగ్ బ్రాత్‌వైట్(2)లను అశ్విన్ పెవిలియన్ చేర్చగా.. రేయ్‌మన్ రైఫర్(2)ను శార్దూల్, బ్లాక్‌వుడ్(14)ను జడేజా పెవిలియన్ చేర్చారు. మహమ్మద్ సిరాజ్ సూపర్ క్యాచ్‌తో బ్లాక్ వుడ్ ఔటయ్యాడు.
ఇషాన్ కిషన్‌తో పాటు యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. కోహ్లీ చేతుల మీదుగా ఇషాన్.. రోహిత్ చేతుల మీదుగా యశస్వీ అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు. కేఎస్ భరత్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ మూడో పేసర్‌గా జయదేవ్ ఉనాద్కత్‌కు అవకాశం ఇచ్చింది.