
ఫిబ్రవరి 6 నుంచి..
పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులో చోటు సంపాందించగా.. రవి బిష్ణోయ్ అరంగేట్రం చేయనున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు.. రెండు రోజుల్లో అహ్మదాబాద్ చేరుకోనుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే ఫిబ్రవరి 6న జరగనుండగా.. రెండో వన్డే ఫిబ్రవరి 9న, మూడో వన్డే 11న జరగనుంది. ఫిబ్రవరి 16, 18, 20వ తేదీల్లో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది.

1000వ వన్డే..
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న వన్డే సిరీస్ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ నిలువనుంది. తొలి వన్డేతోనే టీమిండియా ఈ ఘనతను అందుకోనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచిపోనున్నాడు. గత ఏడాది డిసెంబరులో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన భారత సెలెక్టర్లు.. రోహిత్ శర్మకి పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మకి అదే ఫస్ట్ మ్యాచ్ కావడం విశేషం.

కోహ్లీకి చాన్స్ మిస్..
1974లో ఇంగ్లాండ్‌పై ఫస్ట్ వన్డే మ్యాచ్‌ను అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో ఆడిన భారత్.. ఆ తర్వాత 100వ వన్డేని కపిల్‌దేవ్ కెప్టెన్సీలో ఆడింది. అనంతరం 500 వన్డేకి సౌరవ్ గంగూలీ, 700, 800, 900 వన్డేకి కూడా మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ వహించాడు. కానీ.. విరాట్ కోహ్లీకి అవకాశం దక్కలేదు. ఫిబ్రవరి 6న రోహిత్ శర్మ 1000వ వన్డేకి కెప్టెన్సీ వహించబోతున్నాడు.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ జట్టు కూడా 1000 వన్డేల మైలురాయిని చేరుకోలేదు. భారత్ 999 వన్డేలు ఆడి నెం.1 స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 998 వన్డేలు, పాకిస్థాన్ 936 వన్డేలతో టాప్-3లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications












