Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం!

టరౌబా: వెస్టిండీస్‌తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బుధవారం తెల్లవారుజామున ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్ కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

IND vs WI: India nail West Indies by 200 Runs in Series Decider

వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోతీ, యాన్నిక్ కరయ్య తలో వికెట్ తీసారు. భారత బ్యాటింగ్‌లో రుతురాజ్ గ్వైకాడ్(8) తప్పా అందరూ రాణించారు. సూర్యకుమార్ యాదవ్(35), రవీంద్ర జడేజా(8 నాటౌట్) పర్వాలేదనిపించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్.. శార్దూల్ ఠాకూర్(4/37), ముకేష్ కుమార్(3/30), కుల్దీప్ యాదవ్(2/25) ధాటికి 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్ ఉనాద్కత్ ఓ వికెట్ తీసాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్(50 బంతుల్లో 3 ఫోర్లతో 32), గుడకేష్ మోతీ(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

బ్రాండన్ కింగ్(0), కైల్ మేయర్స్(4), షై హోప్(5), కీసీ కార్టీ(6), షిమ్రాన్ హెట్‌మైర్(4), రోమారియో షెఫెర్డ్(8) దారుణంగా విఫలమయ్యారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కగా.. శుభ్‌మన్ గిల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది వరుసగా 16వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. 2006 నుంచి విండీస్ జట్టుకు భారత్ సిరీస్ కోల్పోలేదు.

Story first published: Wednesday, August 2, 2023, 7:15 [IST]
Other articles published on Aug 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+