For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: టీమిండియా నయా చరిత్ర! మూడో వన్డేలోనూ విండీస్ చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్!

IND vs WI: India beat Windies by 119 runs to complete 3-0 series clean sweep
సిరీస్ క్లీన్ స్వీప్, ఒక జట్టును డబుల్‌ వైట్‌వాష్‌ చేసిన మూడో జట్టుగా *Cricket | Telugu OneIndia

పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలోనూ టీమిండియా డకవర్త్ లూయిస్ పద్దతిన 119 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా కరేబియన్ గడ్డపై టీమిండియా నయా చరిత్రను లిఖించింది. వెస్టిండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్ వాష్ చేయడం టీమిండియాకు ఇదే తొలి సారి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది.

పాపం శుభ్‌మన్..

శుభ్‌మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 98) సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలవగా.. శిఖర్ ధావన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత్‌ ఇన్నింగ్స్‌కు రెండు సార్లు వర్షం అడ్డు రావడంతో మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. దీంతో తృటిలో శుభమన్‌ గిల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. శ్రేయస్‌ అ‍య్యర్‌ 44 పరుగులు చేయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 8 నిరాశపరిచాడు.

చాహల్ మాయ..

అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిన టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించలేకపోయింది. 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లలో బ్రాండన్‌ కింగ్‌ (42), నికోలస్‌ పూరన్‌( 42), హోప్‌(22) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో యుజ్వేంద్ర చహల్‌ (4/17) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణా చెరో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

మూడో జట్టుగా..

ఇక విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో ఒక జట్టును డబుల్‌ వైట్‌వాష్‌ చేసిన మూడో జట్టుగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనకు వచ్చిన విండీస్‌ 3-0తో వైట్‌వాష్‌ అయింది. 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపైనే 4-0తో వైట్‌వాష్‌ చేయగా.. అదే ఏడాది కెన్యా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో డబుల్‌ వైట్‌వాష్‌ చేసింది.ఇక 2006లో బంగ్లాదేశ్‌ ఇంటా, బయటా రెండుసార్లు 3-0తో కెన్యాను క్లీన్‌స్వీప్‌ చేసింది.

విండీస్ చెత్త రికార్డు..

ఈ ఏడాది జూన్‌- జూలై మధ్యలో విండీస్‌ 9 వన్డే మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యింది. ఇంతకముందు 2005లో ఫిబ్రవరి-ఆగస్టు మధ్య 11 వన్డేలు, అక్టోబర్‌ 1999-జనవరి 2000 మధ్య 8 వన్డేలు, జూలై 2009-ఫిబ్రవరి 2010 మధ్య 8వన్డేల్లో పరాజయాలు చవిచూసింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో భాగంగా 2007 నుంచి 2022 వరకు చూసుకుంటే వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది 12వ సిరీస్‌ విజయం. అంతేకాదు వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక వన్డే సిరీస్‌లు గెలిచిన జాబితాలో టీమిండియా తొలి స్థానంలో ఉంది.

Story first published: Thursday, July 28, 2022, 8:39 [IST]
Other articles published on Jul 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+