ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక ఐదో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తమ సత్తాను పరీక్షించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకుంటున్నాం.
ఈ పిచ్ బాగుంది. గతేడాది కంటే మెరుగ్గా ఉంది. ఇలాంటి వికెట్లపై ధైర్యంగా ఆడాలి. గత మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి రెండు బంతుల్లో కూడా కమ్‌బ్యాక్ చేయగలిగితే అది జట్టు విజయానికి కీలకం అవుతుంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాను బౌలింగ్ ఎంచుకునేవాడినని వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పోవెల్ తెలిపాడు. 'ముందుగా బౌలింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గత మ్యాచ్‌లో మేం కాస్త తడబడ్డాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇది మంచి పిచ్. బ్యాటర్లకు తగ్గట్లు ప్రణాళికలు చేయాలి.
మేం బెస్ట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. జోసెఫ్, మెక్‌కాయ్ జట్టులోకి వచ్చారు.'అని రోవ్‌మన్ పోవెల్ చెప్పుకొచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో ఈ మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ఇందులో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాడు.
దాంతో ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్ ఒక్క అవకాశాన్ని కూడా అందుకోలేకపోయారు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో టీమిండియాకు బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశమే లేకుండా పోయింది.
తుది జట్లు:
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షైహోప్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పోవెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, రోమారియో షెఫర్డ్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్.