Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: సిక్సర్ల సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్!

న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ తొలిసారి టీ20 ఫార్మాట్‌లో టీమిండియా పిలుపు అందుకున్నారు.

ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చిన ఆటగాళ్లు సీనియర్ ప్లేయర్లను ఈ సిరీస్‌కు దూరంగా ఉంచారు. అయితే ఐపీఎల్‌లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అతనికి బదులు తిలక్ వర్మకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు.

IND vs WI: Fans slams BCCI for Rinku Singh Misses Out on India T20I Squad

అయితే సూపర్ ఫినిషర్ అయిన రింకూ సింగ్‌ను తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు రింకూ సింగ్‌కు పక్కనపెట్టడానికి గల కారణం ఏంటో తెలియజేయాలని నిలదీస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన రింకూ సింగ్.. 14 మ్యాచుల్లో 59.25 సగటుతో 149.53 స్ట్రైయిక్ రేటుతో 474 పరుగులు చేసాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది సంచలన విజయాన్నందించాడు.

ఈ సీజన్‌లో 4 హాఫ్ సెంచరీలు చేసిన రింకూ సింగ్, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 9లో నిలిచాడు. మిడిలార్డర్‌లో వచ్చి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. టీమిండియాలో ఫినిషర్ పాత్రకు రింకూ సింగ్ సరిగ్గా సరిపోతాడని, అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం అన్యాయమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సిక్సర్ల సింగ్‌కు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంపై రింకూ సింగ్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలెక్షన్‌ను ఉద్దేశించి ఇన్‌స్టా స్టోరీలో ఓ కొటేషన్ షేర్ చేశాడు. 'కొందరికీ సోఫా కేవలం ఓ ఫర్నీచర్ మాత్రమే. మరికొందరికి అది సెలక్షన్‌కు తలుపు'అంటూ విలియం షేక్స్‌స్పియర్ కొటేషన్‌ను పంచుకున్నాడు.

వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టు:
ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, ముకేష్ కుమార్

Story first published: Thursday, July 6, 2023, 12:58 [IST]
Other articles published on Jul 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+