Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఓయ్.. రోహిత్ ఇది పద్దతేనా? సూరీడు కోసం సంజూ శాంసన్‌కు అన్యాయమా?

బ్రిడ్జ్‌టౌన్: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి అన్యాయమే జరిగింది. వెస్టిండీతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ కేరళ ఆటగాడికి చోటు దక్కలేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌కే అవకాశం ఇచ్చింది. దాంతో చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న సంజూ శాంసన్‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది.

మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు టీమిండియా వికెట్ కీపర్‌గా తొలి ఆప్షన్ సంజూ శాంసన్‌కే దక్కుతుందని అంతా భావించారు. టాపార్డర్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మిడిలార్డర్‌లో రాణించలేడని, సంజూ ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం టాప్-5 బ్యాటర్లలో లెఫ్టాండర్ లోటు ఉంటుందని ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించింది.

Fans Slam Rohit Sharma

అలాగే టీ20 నెంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కోసం సంజూ శాంసన్‌పై వేటు వేసింది. ఈ నిర్ణయంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టి సంజూను ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

ముంబై క్రికెటర్ల లాబియింగ్‌తో సంజూ శాంసన్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల కోసం శాంసన్ కెరీర్‌ను నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ అతన్ని జట్టులోకి తీసుకొని ఇలానే బెంచ్‌పై కూర్చోబెట్టారని, ఏదో ఒక మ్యాచ్‌లో ఆడించి పక్కనపెట్టారని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని మండిపడుతున్నారు. నెంబర్4లో సీనియర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్ సరిపోయేవాడని, వరల్డ్ కప్‌‌కు కూడా పనికొస్తాడని సూచిస్తున్నారు.

ఈ మ్యాచ్‌తో ముకేష్ కుమార్ వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. ఉమ్రాన్ మాలిక్ రీఎంట్రీ ఇచ్చాడు. మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ జట్టులోకి రాగా.. యుజ్వేంద్ర చాహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Story first published: Thursday, July 27, 2023, 20:09 [IST]
Other articles published on Jul 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+