Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: హవ్వా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు 500 డాలర్లా?

హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. రికార్డు సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171)‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అయితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ రివార్డుగా అతనికి 500 అమెరికా డాలర్లు దక్కడం‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.41 వేలు మాత్రమే. దాంతో ఫ్యాన్స్ ఈ రివార్డును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత దేశవాళీ క్రికెట్‌లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు ఎక్కువగా ఉందని సెటైర్లు పేల్చుతున్నారు.

IND vs WI:

ఈ రివార్డ్ టీమిండియా ఆటగాళ్ల షూ విలువతో సమానమని కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. అంత ఇచ్చుకోలేక 500 అమెరికా డాలర్లకే రివార్డును పరిమితం చేసింది. టీమిండియా ఈ సిరీస్ ఆడటానికి ప్రధాన కారణం కూడా విండీస్ బోర్డుకు ఆర్థిక చేయూతనిచ్చేందుకే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దాంతోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డుపై ఆటగాళ్లు కూడా నోరు మెదపటం లేదు. ఫ్యాన్స్ మాత్రం ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. గతంలో మిక్సీలు, గ్రైండర్స్ ఇచ్చారని, ఈసారైనా 500 డాలర్లు ఇస్తున్నారని జోకులు పేల్చుతున్నారు.

యశస్వి సూపర్ ఇన్నింగ్స్‌కు తోడుగా రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 421/5 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 130 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.

అశ్విన్(7/71) ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, సిరాజ్ ఓ వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 150 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, July 15, 2023, 17:27 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+