Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: పాపం.. భారత ఆటగాళ్లకు బట్టలు లేకుండా చేశారు!

IND vs WI: Fans comes up with hilarious jokes after three players wear Arshdeep Singh’s jersey

న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనవంతమైక క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఈ బోర్డుకు చెందిన ఆటగాళ్ల ఆదాయం కోట్లలోనే. టీమిండియాతో ఒక్క మ్యాచ్ ఆడిందంటే ఎంత పేద క్రికెట్ బోర్డు దరిద్రం అయినా ఇట్టే పోతుంది. అందుకే భారత్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు క్రికెట్ దేశాలు ఆసక్తి కనబరుస్తాయి. అయితే అంతటి ధనవంతమైన క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు కాలం కఠిన పరీక్ష పెట్టింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు మంగళవారం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

లగేజీ ఆలస్యంగా రావడంతో..

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అలసత్వం కారణంగా టీమిండియా లగేజీ ఆలస్యంగా వచ్చింది. దాంతో మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లకు జెర్సీలు లేవు. ఆ కారణంగానే మ్యాచ్‌ను మూడు గంటలు వాయిదా వేసారు. అయినప్పటికీ లగేజీ రాకపోవడంతో చేసేదేమి లేక ఇతర ఆటగాడి జెర్సీని ధరించి బరిలోకి దిగారు. అర్షదీప్ సింగ్‌కు జెర్సీలను ధరించడంతో టీమిండియా ఓపెనర్ మొదలు, 11 నెంబర్ బ్యాటర్ వరకు ముగ్గురు అర్ష్‌దీప్‌లు బ్యాటింగ్‌కు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సూర్యకుమార్ యాదవ్ తో పాటు అవేశ్ ఖాన్ అర్షదీప్ జెర్సీతో బరిలోకి దిగారు.

అర్షదీప్ జెర్సీతో ఓపెనింగ్..

సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మతో కలిసి మళ్లీ ఓపెనింగ్ చేశాడు. అతని లగేజీ రాకపోవడంతో సూర్య.. అర్ష్‌దీప్ జెర్సీ వేసుకున్నాడు. అవేశ్ ఖాన్ దీ అదే పరిస్థితి. ఇక అర్ష్‌దీప్ ఎలాగూ తన జెర్సీనే వేసుకోవడంతో నిన్నటి మ్యాచ్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లను వెనుకనుంచి చూసినవారికి ఎవరు అసలైన అర్ష్‌దీప్ అని తేల్చుకోవడం కష్టమైంది. వీళ్లే గాక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన దీపక్ హుడా కూడా ప్రసిధ్ కృష్ణ జెర్సీ వేసుకున్నాడు. ఈ ఇద్దరూ అధికారికంగా నిన్నటి మ్యాచ్‌లో భాగం కాకున్నా ఒకరి జెర్సీ మరొకరు వేసుకోవడం విశేషం.

ఫ్యాన్స్ ఫైర్..

ఇక ఇదే విషయమై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. విండీస్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్‌తో మీమర్స్ సెటైర్లు పేల్చుతున్నారు. 'ఓపెనర్ అర్ష్‌దీపే. చివరి బ్యాటర్ కూడా అతడే..', 'ప్రయోగాలు బాగానే ఉన్నాయి. కానీ అర్ష్‌దీప్ తో ఓపెనింగ్ చేయిస్తున్నారు. ఇది సరైందో కాదో మరి ఒకసారి చూసుకున్నారా..?', 'అర్ష్‌దీప్ జెర్సీకి ఇంత ప్రాముఖ్యత ఉన్నదని ఈ మ్యాచ్ చూసేదాకా తెలియలేదు', 'ముగ్గరు అర్ష్‌దీప్ లు ఈ మ్యాచ్ ఆడుతున్నారు. మరి అతనికి కనీసం ఒక్క ఓవర్ అయినా ఎక్కువివ్వరా..?', 'అర్ష్‌దీప్ జెర్సీ వేసుకున్న అవేశ్.. అతడిలాగే బౌలింగ్ చేస్తాడా..?' అని కామెంట్స్ చేశారు.

బట్టలు లేకుండా చేశారు కదరా?

ఇంకొందరైతే ఎంతటి పరిస్థితిని తీసుకొచ్చార్రా..? కోట్ల ఆదాయం ఉంటే ఆటగాళ్లకు బట్టలు లేకుండా చేశారు కదరా? అంటూ విండీస్ బోర్డుపై జోకులు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. హార్ధిక్ పాండ్యా (31) టాప్ స్కోరర్. విండీస్ పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ ఆరు వికెట్లతో భారత్ పతనాన్నిశాసించాడు. అనంతరం వెస్టిండీస్ జట్టు.. 19.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. బ్రాండన్ కింగ్ (68) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Tuesday, August 2, 2022, 17:07 [IST]
Other articles published on Aug 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+