Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: యుజ్వేంద్ర చాహల్‌కు ఘోర అవమానం!(వీడియో)

తరౌబా: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఘోర అవమానం ఎదురైంది. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో చాహల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో గందరగోళం నెలకొంది. 10వ బ్యాటర్‌గా మైదానంలోకి వచ్చిన చాహల్‌‌లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఫీల్డ్ అంపైర్ ఆడుకున్నారు.

ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ అన్ననే తక్కువ అంచనా వేస్తారా? అని సెటైర్లు పేల్చుతున్నారు. కోహ్లీ కోచ్.. రోహిత్ మెంటార్ అయిన చాహల్‌‌ను బ్యాటింగ్ చేయకుండా అడ్డుకుంటారా? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

IND vs WI: Dravid try to stop Chahal as he walks out to bat in last over goes viral

అసలేం జరిగిందంటే..?:ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత్‌ తడబడింది. విండీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవ్వడంతో భారత్ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. రొమారియో షెఫెర్డ్ వేసిన తొలి బంతికి కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దాంతో యుజ్వేంద్ర చాహల్ క్రీజులోకి వచ్చాయి. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం చాహ‌ల్‌కు బదులు బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ముకేష్ కుమార్‌ను పంపించాలని భావించారు. కానీ చాహల్ అప్పటికే క్రీజులోకి వెళ్లడంతో ఉమ్రాన్ మాలిక్‌తో సమాచారమిచ్చారు.

ఆ వెంటనే చాహల్ మైదానం బయటకు పరుగెత్తాడు. బౌండరీ లైన్ ధాటి డగౌట్ వైపు వెళ్తుండగా.. ఫీల్డ్ అంపైర్ అడ్డుకున్నాడు. ఒక్కసారి మైదానంలోకి వచ్చిన తర్వాత అలా వెళ్లడానికి నిబంధనలు ఒప్పుకోవని తెలిపాడు. దాంతో చేసేదేమి లేక చాహల్ బ్యాటింగ్‌ చేశాడు.

అర్ష్‌దీప్ కూడా ఔటవ్వడంతో ముకేష్ కుమార్ కూడా బ్యాటింగ్‌కు దిగాడు. చివరికి ముకేష్, చాహల్ ఒక్కో పరుగు చేసి నాటౌట్ గా నిలవగా.. భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. పేలవ బ్యాటింగ్‌తో 4 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఖంగు తిన్నది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది.

నికోలస్ పూరన్(41), రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, August 4, 2023, 12:49 [IST]
Other articles published on Aug 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+