Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: కెప్టెన్‌గా బ్రాత్‌వైట్.. భారత్‌తో ఆడే వెస్టిండీస్ టెస్ట్ టీమ్ ఇదే!

న్యూఢిల్లీ: సొంతగడ్డపై టీమిండియాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) శుక్రవారం వెల్లడించింది. వెటరన్ బ్యాటర్ క్రెగ్ బ్రాత్‌వైట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విండీస్ బోర్డు.. మొత్తం యువ ఆటగాళ్లకే అవకాశం కల్పించింది.

జులై 9నాటికి తొలి టెస్టు జరిగే డొమినికాకు విండీస్‌ జట్టు చేరుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం వెస్టిండీస్‌ ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడుతుండటంతో సీనియర్ ఆటగాళ్లంతా ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారు. జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కేల్ మేయర్స్ స్థానంలో కొత్త ఆటగాళ్లు కావెమ్‌ హోడ్గే, అలిక్ అతానాజ్, జైయిర్ మెక్‌అలిస్టర్‌‌లు అవకాశం అందుకున్నారు.

IND vs WI: Brathwaite to lead as West Indies announces squad ahead of Test series against India

క్రెగ్ బ్రాత్‌వైట్, టాగెనరైన్ చంద్రపాల్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ పెద్దగా భారత అభిమానులకు తెలియదు. ఇప్పటికే అత్యంత బలహీనమైన వెస్టిండీస్‌తో ఈ మ్యాచ్‌లు అవసరమా? అని భావిస్తున్న భారత మాజీ క్రికెటర్లు, అభిమానులను సీడబ్ల్యూ మరింత నిరాశపరిచింది. పుండు మీదు కారం చల్లినట్లు.. ఈ సిరీస్‌ను పెద్దగా పట్టించుకోకుండా యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

ఈ సిరీస్ ఆడటం వల్ల టీమిండియాకు వచ్చే లాభం ఏమైనా? ఉందా? అని ఇప్పటికే సునీల్ గవాస్కర్.. బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత ప్రదర్శనలు, సెంచరీలు చేయడం మినహా ఈ పర్యటన ఎందుకు పనికిరాదన్నాడు. ఈ టూర్‌కు సీనియర్లకు బదులు యువ ఆటగాళ్లను పంపించి టీమిండియా వన్డే ప్రపంచకప్‌పై ఫోకస్ పెడితే బాగుంటుందన్నాడు.

ఇక వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లకు టీమిండియా 16 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు వేసిన భారత సెలెక్టర్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్‌లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు విండీస్ చేరుకోగా.. మరికొందరు దశల వారీగా అక్కడికి వెళ్లనున్నారు.

తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, కేఎస్ భరత్ విండీస్ పయనం కాగా.. కోహ్లీ, రోహిత్ కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకోనున్నారు.

వెస్టిండీస్ టీమ్: క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), అలిక్‌ అతానాజ్, బ్లాక్‌వుడ్, బోనెర్, టాగెనరైన్ చంద్రపాల్, రహ్‌కీమ్‌ చంద్రపాల్, జాషువా సిల్వా, గాబ్రియల్, కావెమ్ హోడ్గే, అకీమ్ జోర్డాన్, జైయర్, కిర్క్‌ మెకెన్జీ, మిండ్లే, అండర్సన్‌ ఫిలిప్‌, రీఫెర్, కీమర్‌ రోచ్, జయ్‌దేన్‌ సీల్స్‌, వారికన్

Story first published: Friday, June 30, 2023, 16:36 [IST]
Other articles published on Jun 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+