IND vs WI: భారత క్రికెట్ సర్వ నాశనం.. బీసీసీఐపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్‌తో కీలకమైన మూడో వన్డేలోనూ కోహ్లీకి అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. భారత క్రికెట్ సర్వనాశనం అవుతుందని, అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ కావడంతో ముంబై లాబీయింగ్ జరుగుతుందని అభిమానులు ఆరోపిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చి బెంచ్ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది. రెండో వన్డేలోనే కోహ్లీ, రోహిత్‌ను పక్కనపెట్టగా.. టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. దాంతో డిసైడర్ మ్యాచ్‌లోనైనా కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇస్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ కొత్తగా రుతురాజ్ గైక్వాడ్, జయదేవ్ ఉనాద్కత్‌లకు అవకాశం కల్పించింది. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్‌లకు రెస్ట్ ఇచ్చింది. అయితే విరాట్ కోహ్లీని జట్టు నుంచి సాగనంపే ప్రయత్నాలు బీసీసీఐ చేస్తుందని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు. సూపర్ ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉన్న కోహ్లీకి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ భారత జట్టును నాశనం చేశాడని, ఇప్పుడు అగార్కర్ ముంబై లాబీయింగ్‌తో మరింత అధ్వాన్నంగా తయారవనుందని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రవిడ్‌లపై వేటు వేయాలని అభిప్రాయపడుతున్నారు.
వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ దుమ్మురేపాడని, కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ కావాలనే అతన్ని పక్కనపెట్టిందని ఆరోపిస్తున్నారు. తొలి టెస్ట్‌లో కోహ్లీ 76 పరుగులు చేశాడని, రెండో టెస్ట్‌లో 121 చేయగా.. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉద్దేశపూర్వకంగానే డిమోట్ చేశారని మండిపడుతున్నారు. తొలి వన్డేలోనూ బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని, రెండు, మూడో వన్డేలో పూర్తిగా దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతని రిథమ్‌ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. బీసీసీఐకి బాప్ కోహ్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. దాంతో భారత్ తొలి పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications