For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: మళ్లీ హైటెన్షన్ మ్యాచ్.. అదరగొట్టిన అక్షర్.. విండీస్‌పై భారత్‌ విజయం! సిరీస్ కైవసం!

IND vs WI: Axar Patels Help India Beat West Indies by 2 Wickets to Clinch Series

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి వన్డే తరహాలోనే ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మళ్లీ భారతే పై చేయి సాధించింది. కాకపోతే తొలి వన్డేలో విజయం కోసం విండీస్ పోరాడితే... రెండో మ్యాచ్‌లో భారత్ చెమటోడ్చింది. అక్షర్ పటేల్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ పుణ్యమా టీమిండియా విజయాన్నందుకుంది.

 షై హోప్ సెంచరీ..

షై హోప్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్‌లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్‌ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు.

ఆదుకున్న అక్షర్ పటేల్

ఆదుకున్న అక్షర్ పటేల్

ఇక శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీపక్ హుడా సాయంతో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. హుడా వెనుదిరిగినా.. సిరాజ్(1 నాటౌట్) సాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.

క్రీజులో సిరాజ్ ఉండటంతో విజయం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ వరుసగా మూడు బంతులు సింగిల్ తీసిన అక్షర్.. నాలుగో బంతికి భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ రెండేసి వికెట్లు తీయగా.. సీల్స్, రొమారియో, అకీల హోసిన్ తలో వికెట్ పడగొట్టారు.

అవేశ్‌ ఖాన్‌ 244

అవేశ్‌ ఖాన్‌ 244

వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో బరిలో దిగడం ద్వారా భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 244వ క్రికెటర్‌గా అవేశ్‌ ఖాన్‌ గుర్తింపు పొందాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిధ్‌ కృష్ణ స్థానంలో అవేశ్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ చేతుల మీదుగా అవేశ్‌ టోపీని అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్‌ ఖాన్‌ ఇప్పటివరకు భారత్‌ తరఫున 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు.

భారత్ వరల్డ్ రికార్డు..

భారత్ వరల్డ్ రికార్డు..

ఈ సిరీస్ విజయం ద్వారా వన్డేల్లో ప్రపంచ రికార్డును భారత్‌ తమ ఖాతాలో వేసుకుంది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్‌ నిలిచింది. 2006 నుంచి ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 12 వన్డే సిరీస్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించిన పాకిస్తాన్‌ రెండో స్థానంలో ఉంది.

Story first published: Monday, July 25, 2022, 8:35 [IST]
Other articles published on Jul 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+