Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: అలిక్ అథనాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. నోరెళ్లబెట్టిన ఇషాన్ కిషన్(వీడియో)

బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ ప్లేయర్ అలిక్ అథనాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అథనాజ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మైమరిపించాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్(55) నిరాశగా పెవిలియన్ చేరాడు. రోమారియో షెఫెర్డ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసింది.

ఈ ఓవర్ మూడో బంతిని షెఫెర్డ్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా ఇషాన్ కిషన్ కట్ షాట్ ఆడాడు. అయితే బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అలిక్ అథనాజ్ అద్భుతంగా డైవ్ చేసి రెండు చేతులతో బంతిని అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను చూసి ఇషాన్ కిషన్ బిత్తరపోయాడు. నెమ్మదిగా క్రీజును వీడాడు.

IND vs WI:

ఇదే ఓవర్‌ తొలి బంతి ఈ తరహాలోనే రాగా.. ఇషాన్ కిషన్ తనదైన కట్‌షాట్‌తో బౌండరీ రాబట్టాడు. ఈ షాట్‌తో ఫీల్డ్‌లో కాస్త మార్పు చేసిన విండీస్ కెప్టెన్ షైహోప్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగిస్తుండగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ఆగిపోయిన సమయానికి 24.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(0) మాత్రమే ఉన్నాడు.

ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించిన అనంతరం శుభ్‌మన్ గిల్(34) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ అథనాజ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరగ్గా.. అక్షర్ పటేల్‌ను షెఫెర్డ్(1) పెవిలియన్ చేర్చాడు.

ఆ కొద్ది సేపటికే హార్దిక్ పాండ్యా(7)ను సీల్స్ ఔట్ చేయగా.. ఆచితూచి ఆడుతున్న సంజూ శాంసన్(9)ను యానిక్ కరయ్యా పెవిలియన్ చేర్చడంతో భారత్ 113 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 23 పరుగుల వ్యవధిలోనే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. రోమారియో షెఫర్డ్ రెండు వికెట్లు తీయగా.. యానిక్ కరయ్యా, జేడెన్ సీల్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, July 29, 2023, 21:42 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+