పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అసాధారణ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్ ఫీల్డర్‌గా ఉన్న రహానే సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రహానే సూపర్ ఫీల్డింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. చివరి సెషన్ తొలి ఓవర్(87)లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని రవీంద్ర జడేజా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. బంతి టర్న్ అవ్వడంతో పాటు అనూహ్యంగా బౌన్స్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ దిశగా దూసుకెళ్లింది.

బంతి గమనాన్ని గమనించిన రహానే అంతే వేగంగా రియాక్ట్ అయ్యి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. దాంతో బ్లాక్‌వుడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. రహానే క్యాచ్ అద్భుతమని, అతని ఫీల్డింగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడని రహానేను కొనియాడుతున్నారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 108 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ (11 బ్యాటింగ్), అథనేజ్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది.
కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75) హాఫ్ సెంచరీతో రాణించగా.. కిర్క్ మెకంజీ (32), బ్లాక్‌వుడ్ (20), జాషువా ద సిల్వా (10) మరోసారి విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశ్విన్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో 67 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్, కీమర్ రోచ్ మూడేసి వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసాడు. షెన్నన్ గాబ్రియల్‌కు ఓ వికెట్ దక్కింది.