Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: థ్రిల్లింగ్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ విజయం!

IND vs WI: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 14 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ కీలక విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ చేసిన 223 పరుగులకు ప్రతిస్పందనగా వెస్టిండీస్ ఏడు వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సిరీస్‌లోని నాలుగో టీ20 మ్యాచ్ అక్టోబర్ 14(బుధవారం) నాడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో అత్యధికంగా పడగొట్టగా, నమన్ ధీర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.

IND vs WI: ఊచకోత.. ఇండోర్‌లో అభిషేక్ శర్మ రికార్డుల విధ్వంసం!

IND vs WI: ఊచకోత.. ఇండోర్‌లో అభిషేక్ శర్మ రికార్డుల విధ్వంసం!

భారత్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ పేలవమైన ఆరంభాన్ని అందుకుంది. జట్టు స్కోరుకు కేవలం ఏడు పరుగులు మాత్రమే చేరినప్పుడు కెప్టెన్ , వికెట్ కీపర్ షాయ్ హోప్‌ను అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హోప్ ఐదు బంతుల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మెయర్ కొన్ని మంచి షాట్లు ఆడి 26 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. నమన్ ధీర్ బౌలింగ్‌లో హెట్మెయర్ బౌల్డ్ అయ్యాడు. రోవ్‌మన్ పావెల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు, ఏడు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేశాడు. శాంప్సన్ 21 పరుగులు చేసి ఔటవ్వగా.. కీమో పాల్ 10 పరుగుల వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితమైంది. రూథర్‌ఫోర్డ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ తన మూడో వికెట్‌ను పడగొట్టాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 20 బంతుల్లో 32 పరుగులు చేసి ఔవుటయ్యాడు. షమర్ స్ప్రింగర్ 11 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రోస్టన్ చేజ్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

IND vs WI 3rd T20I India Defeat West Indies by 14 Runs to Take 2-1 Lead in Series Full Details

అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ
అభిషేక్ శర్మ వేగంగా అర్ధశతకం సాధించినప్పటికీ.. వెస్టిండీస్ జట్టు భారత్‌ను 223 పరుగులకే ఆలౌట్ చేసింది. అభిషేక్ 30 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 69 పరుగులు చేయడమే కాకుండా ఇషాన్ కిషన్‌తో (18 బంతుల్లో 37 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు పటిష్టమైన పునాది వేశాడు. అయితే ఈ భాగస్వామ్యం విచ్ఛిన్నమైన తర్వాత, భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో, జట్టు ఆశించినన్ని పరుగులు చేయలేకపోయి ఇన్నింగ్స్ చివరి బంతికి ఆలౌట్ అయింది.

IND vs WI 3rd T20: భారత జట్టులో రెండు కీలక మార్పులు!

Also Read

IND vs WI 3rd T20: భారత జట్టులో రెండు కీలక మార్పులు!

మొదట బౌలింగ్ ఎంచుకున్న విండీస్ కెప్టెన్
వెస్టిండీస్ తరఫున ఆఫ్-స్పిన్నర్ రోస్టన్ చేజ్ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచి, 38 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు షమర్ స్ప్రింగర్, షమర్ జోసెఫ్ కూడా చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, వరుసగా 50, 54 పరుగులు ఇచ్చారు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా, షమర్ జోసెఫ్ వేసిన రెండో ఓవర్‌లోనే సంజు శాంసన్ (03) కమీల్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో ఓవర్‌లో రోస్టన్ చేజ్ వేసిన వరుస బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి అభిషేక్ బ్యాట్‌తో తన బౌండరీల ఖాతాను తెరిచాడు. అభిషేక్ శర్మ అదే ఓవర్ చివరి బంతికి కూడా ఒక సిక్స్ కొట్టాడు.

కీమో పాల్ వేసిన తొలి ఓవర్‌లోనే సత్తా చాటిన ఇషాన్ కిషన్
కీమో పాల్ వేసిన తొలి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ మూడు ఫోర్లు కొట్టి తన సత్తా చాటగా.. షమర్ స్ప్రింగర్ వేసిన వరుస బంతుల్లో అభిషేక్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. జోసెఫ్ వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని, పవర్ ప్లేలో జట్టు స్కోరును ఒక వికెట్ నష్టానికి 87 పరుగులకు చేర్చాడు. ఎనిమిదో ఓవర్‌లో భారత్ శతకం పూర్తయింది. తర్వాతి ఓవర్‌లో చేజ్ బౌలింగ్‌లో ఇషాన్ ఒక సిక్సర్ కొట్టినప్పటికీ.. అతని తర్వాతి బంతిని ముందుకు ఆడబోయే ప్రయత్నంలో హోప్ చేతిలో స్టంప్ అయ్యాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (01)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి చేజ్ భారత్‌కు డబుల్ దెబ్బ కొట్టాడు.

అభిషేక్‌ను ఔట్ చేసిన స్ప్రింగర్
అభిషేక్ గాల్లోకి కొట్టిన బంతిని కూడా స్ప్రింగర్‌కే తిరిగి ఇవ్వడంతో, భారత్ స్కోరు 115/1 నుండి 124/4కి చేరింది. నమన్ ధీర్ (10) గుడకేష్ మోటీ బౌలింగ్‌లో ఒక సిక్స్ కొట్టాడు, కానీ తర్వాతి బంతిని లాంగ్ ఆఫ్‌లో ఉన్న స్ప్రింగర్‌కు ఎడ్జ్ ఇచ్చాడు. 13వ ఓవర్‌లో జోసెఫ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి చెరో రెండు ఫోర్లు కొట్టారు. అయితే, నితీష్ (21) కీమో పాల్ వేసిన లెగ్ సైడ్ బయటి వైపు బంతిని ఆడటానికి ప్రయత్నించి వికెట్ కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చాడు.

విచిత్రమైన రీతిలో రనౌట్ అయిన తిలక్ వర్మ
గుడకేష్ మోటీ వేసిన బంతిని అక్షర్ బౌండరీ వైపు ఆడగా.. కమిల్ పూరన్ అద్భుతంగా సేవ్ చేశాడు. అది ఫోర్ అనుకుని క్రీజులోకి తిరిగి వచ్చే ప్రయత్నం కూడా చేయని తిలక్ వర్మ రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ (20) కూడా రనౌట్ కాగా.. ఇన్నింగ్స్ చివరి బంతికి జోసెఫ్ బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ ఔటవడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Sunday, October 11, 2026, 23:07 [IST]
Other articles published on Oct 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+