
ఒబెడ్ మెకాయ్ సిక్సర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్‌కాయ్ (6/17) సిక్సర్‌తో భారత్ పతనాన్ని శాసించాడు.
ఈ లెఫ్టార్మ్ పేసర్ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ(0) ఔటవ్వగా.. సూర్య కుమార్ యాదవ్(11), శ్రేయస్ అయ్యర్(10) అతన్ని అనుసరించారు. రిషభ్ పంత్(24), హార్దిక్ కొంత పోరాడినా హోస్సెన్ దెబ్బతీసాడు. చివర్లో అశ్విన్, కార్తీక్ కూడా విఫలమవడంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. మెక్‌కాయ్ 6 వికెట్లతో పాటు హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసఫ్ తలో వికెట్ పడగొట్టారు.

బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్‌మైర్(6), రోవ్‌మన్ పొవెల్(5) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

ఆవేశ్ ఖాన్ తప్పిదంతో..
స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్‌ను భారత్ ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్.. డేంజరస్ పోవెల్‌ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి.
చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. బంతిని అందుకున్న ఆవేశ్ ఖాన్ తొలి బంతినే నోబాల్ వేసాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న డెవన్ థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఇక్కడ ఆవేశ్ ఖాన్ నో బాల్ వేయకుండా కట్టుదిట్టంగా బంతులు వేసుంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారి విండీస్ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యేవారు. అప్పుడు భారత్ విజయానికి అవకాశం ఉండేది.


Click it and Unblock the Notifications












