Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రో-కో జోడీకి మరో 18 పరుగులే.. వెస్టిండీస్‌పై చరిత్ర సృష్టించడం ఖాయం?

IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రో-కో జోడీ వెస్టిండీస్ జట్టుపై మరో 18 పరుగులు భాగస్వామ్యంగా జోడిస్తే వన్డే క్రికెట్ చరిత్రలోనే విండీస్ జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి జోడీగా చరిత్ర సృష్టిస్తుంది.

IND vs WI: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్!

IND vs WI: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్!

వెస్టిండీస్ జట్టుపై 1000 పరుగుల భాగస్వామ్యం
ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు 23 జోడీలు వేర్వేరు దేశాలపై వన్డేల్లో 1000 వేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. అయితే వెస్టిండీస్‌పై మాత్రం ఏ జోడీ కూడా ఇప్పటివరకు 1000 పరుగుల మార్కును తాకలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వెస్టిండీస్ జట్టుతో జరిగిన 15 వన్డే ఇన్నింగ్స్‌లలో 70కి పైగా సగటుతో 982 పరుగులు భాగస్వామ్యంగా చేశారు. ఇందులో 4 శతకాలు, 2 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై రోహిత్-కోహ్లీ జోడీ 1,454 పరుగులు చేయగా.. ఒకే జట్టుపై అత్యధిక పరుగుల రికార్డు డెస్మెండ్ హేన్స్-రిచీ రిచర్డ్‌సన్(పాకిస్తాన్ పై 1,484 పరుగులు) పేరిట ఉంది.

IND vs WI 1st ODI Rohit Sharma-Virat Kohli Eye Historic 1000 Runs Virat Close to Sachin Records

సచిన్ టెండూల్కర్ 4 ప్రపంచ రికార్డులపై విరాట్ కన్ను
ఈ వన్డే సిరీస్ సందర్భంగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న4 ప్రధాన రికార్డులను అధిగమించేందుకు చాలా దగ్గరగా ఉన్నాడు. వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి మరో 59 పరుగులు మాత్రమే కావాలి. ఈ పరుగులు సాధిస్తే సచిన్ రికార్డును తుడిచిపెట్టేసి అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. లిస్ట్-ఏ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ పేరిట అత్యధికంగా 60 సెంచరీల రికార్డు ఉంది. ప్రస్తుతం 59 సెంచరీలతో ఉన్న విరాట్ కోహ్లీ, సచిన్ ను వెనక్కి నెట్టేందుకు మరో 2 సెంచరీలు చేయాల్సి ఉంది.

IND vs WI: జైస్వాల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి.. ఆసియా గేమ్స్‌కు బుమ్రా అవసరమా?

Also Read

IND vs WI: జైస్వాల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి.. ఆసియా గేమ్స్‌కు బుమ్రా అవసరమా?

ఇండియాలో ఆడుతూ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 41 అంతర్జాతీయ సెంచరీలు బాదాడు. సొంతగడ్డపై సచిన్(42 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టడానికి కోహ్లీకి మరో 2 సెంచరీలు అవసరం. భారత గడ్డపై అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్(164 మ్యాచ్‌ల్లో 6,976 పరుగులు) పేరిట ఉంది. విరాట్ కోహ్లీ(130 మ్యాచ్‌ల్లో 6, 867 పరుగులు) ఈ ఆల్-టైమ్ రికార్డును అధిగమించడానికి కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు.

Story first published: Sunday, September 27, 2026, 11:07 [IST]
Other articles published on Sep 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+