IND vs WI: ఉత్కంఠ పోరులో టీమిండియాను గెలిపించిన సిరాజ్.. పాపం విండీస్!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా శుభారంభం చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో మహహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఆఖరి ఓవర్‌ను కట్టడిగా వేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్నీత 50 ఓవర్లలలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది.
కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీయగా.. అకీల్ హోసిన్, రొమరియో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కైల్ మేయర్స్ చెలరేగినా..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా సిరాజ్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి విండీస్ పతనాన్ని శాసించాడు. అప్పటికే క్రీజులో సెట్ అయిన బ్యాటర్లు ఉన్నా సిరాజ్ ఏ మాత్రం బెదరకుండా బౌలింగ్ చేసాడు.
విండీస్ జట్టులో కైల్ మేయర్స్(68 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75), బ్రాండన్ కింగ్(66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అకీల్ హోసిన్(32 బంతుల్లో 2 ఫోర్లతో 32 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.

ధావన్, గిల్ సూపరో సూపర్..
చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశాన్ని అందుకున్న శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. కెప్టెన్ ధావన్‌తో కలిసి శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో 6.5 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. చూడచక్కని షాట్లతో గిల్ 36 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో 14 ఓవర్ల దాకా 7పైచిలుకు రన్‌రేట్‌తో భారత్ 100/0 స్కోరు చేసింది. తర్వాత 18వ ఓవర్లో ధావన్ 53 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా, గిల్ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ధావన్ సెంచరీ మిస్
అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో రెండో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగడంతో కరీబియన్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సెంచరీపై కన్నేసిన ధావన్... గుడకేశ్ మోతీ 34వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ షాట్‌తో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కానీ తర్వాతి బంతికే అతను పెవిలియన్ చేరడంతో 94 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్, సూర్యకుమార్ (13) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. సంజూ సామ్సన్ (12) కూడా విఫలమవడంతో ఆఖర్లో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. 48వ ఓవర్లో అక్షర్ పటేల్ (21; ఫోర్, సిక్స్) 6, 4 కొట్టగా, దీపక్ హుడా (27; ఫోర్, సిక్స్) 6 బాదడంతో ఏకంగా 20 పరుగులొచ్చాయి. అల్జారీ జోసెఫ్ 49వ ఓవర్లో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చగా, ఆఖరి ఓవర్లో భారత్ 300 మార్క్‌ను దాటింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications