Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: తిప్పేసిన కుల్దీప్ యాదవ్.. భారత్ ముందు భారీ లక్ష్యం!

IND vs WI: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 296 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై అందరి దృష్టి నెలకొంది.

'ఏం చేసినా నో ఛాన్స్': అరంగేట్రం వేళ నమన్ ధీర్‌కు బిగ్ షాక్!

'ఏం చేసినా నో ఛాన్స్': అరంగేట్రం వేళ నమన్ ధీర్‌కు బిగ్ షాక్!

కరీబియన్ ఓపెనర్ల సెంచరీ భాగస్వామ్యం
బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ పై వెస్టిండీస్ కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. జాన్ కాంప్‌బెల్(60 బంతుల్లో 62: 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జస్టిన్ గ్రీవ్స్( 108 బంతుల్లో 101; 12 ఫోర్లు) కలిసి తొలి వికెట్ కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కొత్త బంతితో భారత బౌలర్లు నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ పరుగులను అడ్డుకోలేకపోవడంతో విండీస్ బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించారు.

IND vs WI 1st ODI Kuldeep Yadav 4-Wicket Haul Limits West Indies to 295 Target 296 Full Details

మ్యాజిక్ చేసిన కుల్దీప్ యాదవ్
సరిగ్గా కరీబియన్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్న వేళ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాంప్‌బెల్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కీసీ కార్టీని ఔట్ చేయగా.. కుల్దీప్ విండీస్ కెప్టెన్ షాయ్ హోప్(12)ను పెవిలియన్ పంపాడు. ఇక మ్యాచ్ 36వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ అద్భుత స్పెల్ నమోదు చేశాడు. సెంచరీతో మెరిసిన జస్టిన్ గ్రీవ్స్ ను పక్కా డీఆర్ఎస్ రివ్యూతో ఔట్ చేసిన తదుపరి బంతికే జువెల్ ఆండ్రూ(0)ను గూగ్లీతో బోల్తా కొట్టించాడు. రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చినా కొద్దిలో చేజారింది. కుల్దీప్ 10 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు.

IND vs WI: విండీస్‌తో తొలి వన్డే.. తుది జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్!

Also Read

IND vs WI: విండీస్‌తో తొలి వన్డే.. తుది జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్!

మెరిసిన అమీర్ జంగూ.. టార్గెట్ 296
198 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన వెస్టిండీస్ జట్టును అమీర్ జంగూ(43 బంతుల్లో 58; 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడి జట్టు స్కోరును 295 పరుగులకు చేర్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ 2, నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు. 296 పరుగుల ఛేజింగ్ లో ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు కెప్టెన్ శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ ఎలా సాగుతుందో చూడాల్సిందే.

Story first published: Sunday, September 27, 2026, 18:23 [IST]
Other articles published on Sep 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+