'ఏం చేసినా నో ఛాన్స్': అరంగేట్రం వేళ నమన్ ధీర్‌కు బిగ్ షాక్!
వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో 26 ఏళ్ల ఆల్‌రౌండర్ నమన్ ధీర్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడంపై భారత మాజీ క్రికెటర్ దినేష్ క్రికెటర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో నమన్ ధీర్ చోటు దక్కించుకోవడం చాలా కష్టమని దినేష్ కార్తీక్ కుండబద్ధలు కొట్టనట్లు చెప్పడం గమనార్హం.
నమన్ ధీర్‌కు దక్కిన అవకాశం
అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక ఆల్‌రౌండర్లు ఆసియా గేమ్స్ 2026లో బిజీగా ఉండటంతో నమన్ ధీర్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ముగిసి షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ 2026లో అమృత్‌సర్ సూర్మాస్ తరఫున ఆడిన నమన్ ధీర్.. 72.78 సగటుతో 217.61 స్ట్రైక్ రేట్‌తో 655 రన్స్ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా నమన్ ధీన్ మంచి ఆటతీరును కనబరిచాడు.

ప్రపంచ కప్ ప్రణాళికలపై దినేష్ కార్తీక్ విశ్లేషణ
ఈ విషయం గురించి దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.."నమన్ ధీర్ వన్డే ప్రపంచ కప్‌లో చోటు సాధించడం అనేది ప్రస్తుతానికి చాలా దూరం ఆలోచించడమే అవుతుంది. ఇప్పటికే జట్టులో వాషింగ్టన్ సుందర్ వంటి నాణ్యమైన ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ స్థిరపడి ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచ కప్‌లో అంతమంది స్పిన్నర్లు అవసరం పడకపోవచ్చు" అని పేర్కొన్నారు. "దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అతను సాధించిన విజయాలకు ఈ అరంగేట్రం ఓ మంచి గుర్తింపు. ఇది అతనికి దక్కిన మంచి అవకాశమే అయినప్పటికీ.. సమీప భవిష్యత్తులో అతను ఏం చేసినా తుది జట్టులో రెగ్యులర్ అవకాశాలు రావడం దాదాపు అసాధ్యం" అని వెల్లడించారు.
తొలి వన్డేలో అరంగేట్రం
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్న నమన్ ధీర్.. తొలి వన్డేలో ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా, లోయర్ ఆర్డర్ హిట్టర్‌గా బరిలోకి దిగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్ వేగంగా పరుగులు సాధిస్తూ గట్టి పోటీనిచ్చారు. కుల్దీప్ బౌలింగ్ లో ఎట్టకేలకు జాన్ కాంప్‌బెల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ కు తిరిగి వెళ్లాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


