For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs USA: బుమ్రాకు ఆరోగ్యం బాలేదు: సూర్యకుమార్ యాదవ్

IND vs USA: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అనారోగ్యంతో బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పాడు. అతని స్థానంలో సిరాజ్ బరిలోకి దిగుతున్నాడని చెప్పిన సూర్య.. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదని తెలిపాడు.

మా శైలిని కొనసాగిస్తాం..

'మేం టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఇక్కడ పిచ్ చూడటానికి బాగుంది. ఈ మైదానంలో నేను చాలా క్రికెట్ ఆడాను. గాలులు వీస్తుండటంతో డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు. మెగా టోర్నీ అంటే కొంచెం ఒత్తిడి ఉంటుంది. దాన్ని మనం కాదనలేం. కానీ ఇది కొత్త టోర్నీ. గత రెండేళ్లుగా మేం ఏ విధంగానైతే ఆడుతున్నామో.. అదే శైలిలో కొనసాగించాలని అనుకుంటున్నాం.

మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానం మొత్తం ఉత్సాహంగా ఉంది. మేం బ్యాటింగ్ మొదలుపెట్టాక మైదానం ఇంకా హోరెత్తిపోతుందని తెలుసు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ ఆడటం లేదు. దురదృష్టవశాత్తూ జస్ప్రీత్ బుమ్రా ఆరోగ్యంగా లేకపోవడంతో అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

IND vs USA Suryakumar Yadav Reveals Jasprit Bumrah Is Unwell During India vs USA T20 World Cup 2026 Match
Photo Credit: BCCI(X)

ఇదో గొప్ప అనుభూతి..

మరోవైపు టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన పిచ్‌లా కనిపిస్తోంది. ఈ స్టేడియానికి భారీ స్కోర్ల మైదానంగా పేరుంది. కాబట్టి లక్ష్యం ఎంతో తెలిస్తే మాకు ప్రణాళిక వేసుకోవడం సులువు అవుతుంది.

ముందుగా వాంఖడే స్టేడియంలో ఆడటం గొప్ప అనుభూతి. ప్రపంచ కప్ అనేది ప్రపంచ క్రీడల్లోనే అతిపెద్ద వేదికల్లో ఒకటి. అమెరికా నుంచి మేం చాలా అంచనాలను, ఆశలతో బరిలోకి దిగుతున్నాం. అందుకే ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. చాలా మంది ఆటగాళ్లకు ఇది ఒక కల నిజం కావడం లాంటిది.

మేం మా క్రికెట్ కెరీర్‌ను భారత్‌లోనే ప్రారంభించాం. ఇప్పుడు అమెరికా తరపున ప్రపంచ కప్‌లో ఆడటం చాలా గొప్పగా అనిపిస్తోంది. మేము డి.వై. పాటిల్ స్టేడియంలో కొన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడాం. అక్కడ మా ప్రదర్శన బాగుంది. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మా జట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నారు.'అని మోనాంక్ పటేల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు

యూఎస్‌ఏ: ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), సాయితేజ ముక్కామల్ల, మోనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే, హర్మీత్ సింగ్, మహమ్మద్ మోసిన్, షాడ్లీ వాన్ షాల్క్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవాల్కర్.

భారత్ : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Saturday, February 7, 2026, 19:29 [IST]
Other articles published on Feb 7, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+