Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs USA: మహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! (వీడియో)

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద సిరాజ్‌ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అతని సూపర్బ్ ఫీల్డింగ్‌కు దూకుడుగా ఆడిన నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27) నిరాశగా పెవిలియన్ చేరాడు.

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని నితీష్ కుమార్ పుల్ షాట్ ఆడగా.. స్క్వేర్ బౌండరీ వైపు సిక్సర్ దిశగా దూసుకెళ్లింది. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. అద్భుతంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతను వెనక్కిపడ్డాడు. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs USA Mohammed Siraj takes an incredible catch to dismiss Nitish Kumar video goes viral

ఈ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్బ్ క్యాచ్ అంటూ సిరాజ్‌ను కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు ఇది రెండో క్యాచ్. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అమెరికా స్టార్ బ్యాటర్, కెప్టెన్ ఆరోన్ జోన్స్(11) ఇచ్చిన క్యాచ్‌ను కూడా సిరాజ్ అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Wednesday, June 12, 2024, 21:46 [IST]
Other articles published on Jun 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+