For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూర్యకుమార్ ఇన్నింగ్స్‌పై అమెరికా ప్లేయర్ ఫిదా!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియాను గట్టెక్కించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా అమెరికా స్పిన్నర్, భారత సంతతి ఆటగాడు హర్మీత్ సింగ్ సూర్యను దిగ్గజ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీలతో పోలుస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

కష్టాల్లో జట్టు.. సూర్య ఒంటరి పోరాటం
వాంఖడే స్టేడియంలో అమెరికా బౌలర్ల ధాటికి భారత అగ్రశ్రేణి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా 49 బంతుల్లో 84 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు 29 పరుగుల విజయాన్ని అందించాడు.

IND vs USA Harmeet Singh Hails Suryakumar Yadav Calmness of Dhoni and Maturity of Kohli

హర్మీత్ సింగ్ ప్రశంసలు: 'సూర్యలో ధోనీ, కోహ్లీ కనిపిస్తున్నారు'
మ్యాచ్ అనంతరం అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ సూర్యకుమార్ ఎదుగుదలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "ఒత్తిడి సమయాల్లో సూర్య చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, ప్రశాంతత నాకు దిగ్గజం ఎంఎస్ ధోనీని గుర్తు చేస్తున్నాయి. తన కెరీర్ చివరి దశలో ధోనీ ఎంతటి స్థితప్రజ్ఞతతో మ్యాచ్‌లను ముగించేవారో.. ఇప్పుడు సూర్యలో కూడా అదే నిలకడ కనిపిస్తోంది" అని హర్మీత్ పేర్కొన్నాడు.

అంతేకాకుండా సూర్య ఇన్నింగ్స్‌లో కనిపిస్తున్న బాధ్యతను విరాట్ కోహ్లీతో పోల్చాడు. "సాధారణంగా సూర్య స్ట్రోక్ ప్లేయర్‌గా కనిపిస్తాడు. కానీ నిన్నటి మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి ఫినిషర్ పాత్రను పోషించాడు. విరాట్ కోహ్లీ వంటి గొప్ప క్రికెటర్లలో ఉండే పరిణతి ఇప్పుడు సూర్యలో కనిపిస్తోంది. ఇది అనుభవంతో వచ్చిన మార్పు. తనకు అప్పగించిన బాధ్యతను అతను అద్భుతంగా నెరవేరుస్తున్నాడు" అని కొనియాడాడు.

సొంత గడ్డపై ఆడటం భావోద్వేగం..
భారత సంతతికి చెందిన హర్మీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. "భారత్‌లో ప్రపంచకప్ ఆడటం నాకు చాలా భావోద్వేగపూరితమైన క్షణం. కానీ ఇది నా ఒక్కడి కథ కాదు, మా అమెరికా టీమ్ అందరి కథ. మేమంతా వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ క్రికెట్ మమ్మల్ని కలిపింది" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, February 8, 2026, 19:09 [IST]
Other articles published on Feb 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+