For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs USA: ఒకే ఓవర్లో 4, 6, 6, 4.. ఇదేందయ్యా ఇది! (వీడియో)

IND vs USA: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే అమెరికా బౌలర్ ష్యాడ్లీ వాన్ షాల్క్విక్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. అభిషేక్ శర్మ, శివం దూబే వంటి కీలక ఆటగాళ్లు సున్నా పరుగులకే వెనుదిరగడంతో భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సూర్య ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

చివరి ఓవర్లో స్కై విధ్వంసం
సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాది విధ్వంసం సృష్టించాడు. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ వేశాడు. అప్పటికే క్రీజులో సెట్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఈ ఓవర్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి బంతిని పాయింట్ మీదుగా ఫోర్‌గా మలచిన సూర్య, ఆ తర్వాతి బంతికి తనదైన శైలిలో ఫైన్ లెగ్ వైపు భారీ సిక్సర్ బాదాడు. మూడో బంతికి కూడా అదే జోరును కొనసాగిస్తూ లాంగ్ ఆఫ్ మీదుగా మరో సిక్సర్ బాదడంతో స్టేడియం మార్మోగిపోయింది. ఇక నాలుగో బంతిని షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా బౌండరీకి తరలించి, ఆ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందుకోగలిగింది.

IND vs USA Suryakumar Yadav 4 6 6 4 Madness SKY Leads India to Victory in T20 World Cup 2026

సూర్య అజేయ ఇన్నింగ్స్.. తిలక్ వర్మ సహకారం
సూర్యకుమార్ యాదవ్ కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 84 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 171.43గా నమోదు కావడం విశేషం. సూర్యకు తోడుగా యువ ఆటగాడు తిలక్ వర్మ (25) విలువైన పరుగులు జోడించాడు. ఇషాన్ కిషన్ (20), అక్షర్ పటేల్ (14) కూడా తమ వంతు సహకారం అందించారు. అమెరికా బౌలర్లలో షాల్క్విక్ 4 వికెట్లతో చెలరేగి భారత్‌ను ఒక దశలో భయపెట్టినప్పటికీ, సూర్య వీరోచిత పోరాటం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.

బౌలర్ల పంజా.. అమెరికా విలవిల
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోయినా.. మహ్మద్ సిరాజ్ ఆ లోటును కనిపించకుండా చేశాడు. సిరాజ్ 3 వికెట్లతో అమెరికా బ్యాటింగ్ వెన్నుముక విరవగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లతో సహకరించారు. భారత బౌలర్ల కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ముందు అమెరికా బ్యాటర్లు నిలవలేకపోయారు. చివరికి అమెరికా 20 ఓవర్లలో 132/8 పరుగులకే పరిమితమై, 29 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

Story first published: Sunday, February 8, 2026, 11:58 [IST]
Other articles published on Feb 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+