టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా 111 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది.
నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికాకు తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ ఊహించని షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ షయన్ జహంగీర్(0)ను వికెట్ల ముందు బోల్తాకొట్టించి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ఆండ్రీస్ గౌస్‌ను అదే ఓవర్ ఆఖరి బంతికి క్యాచ్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఆరోన్ జోన్స్‌తో కలిసి మరో ఓపెనర్ స్టీవెన్ టేలర్(24) ఆచితూచి ఆడాడు. రెండు భారీ సిక్స్‌లు బాదిన అతను వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆరోన్ జోన్స్‌ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్‌తో కలిసి టేలర్ జట్టు స్కోర్‌ను 50 పరుగులు ధాటించాడు.
31 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కోరే అండర్సన్‌తో కలిసి నితీష్ కుమార్ దూకుడుగా ఆడాడు. ఓ భారీ సిక్సర్‌తో పాటు 2 బౌండరీలు బాదిన అతన్ని అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్ వద్ద మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్‌తో నితీష్ కుమార్ నిరాశగా క్రీజును వీడాడు.
ఆ మరుసటి ఓవర్‌లో కోరె అండర్సన్(15)ను కీపర్ క్యాచ్‌గా హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ వెంటనే హర్మీత్ సింగ్(10)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయడంతో అమెరికా భారీ స్కోర్‌కు బ్రేక్ పడింది.