IND vs SL వామప్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డకౌట్! (వీడియో)
శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీవ్రంగా నిరాశపర్చాడు. సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి రోజు ఆటలో 90 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 363 పరుగులు చేసింది.
నిషాన్ ఫెర్నాండో(65 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 66), రావిందు రసంతా(143 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), కెప్టెన్ సోనాల్ దినుషా(72 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/64), కుల్దీప్ యాదవ్(2/76), మానవ్ సుతార్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయారు.

రెండో రోజు బ్యాటింగ్‌కు దిగని శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆరంభంలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్(0).. దిలుమ్ సుదీర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వైడ్‌బాల్‌ను వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ ఔటైన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భారత జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై ఆడిన అనుభవం లేదు. శ్రీలంక కండిషన్స్‌ను అర్థం చేసుకోవడానికి ఈ వామప్ మ్యాచ్ వారికి ఉపయోగపడనుంది. కానీ యశస్వి జైస్వాల్ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడు. యశస్వి జైటైనా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(23 బ్యాటింగ్), దేవదత్ పడిక్కల్(52 బంతుల్లో 6 ఫోర్లతో 44 బ్యాటింగ్) ఆచితూచి ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఇద్దరూ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో రాణిస్తుండటంతో 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. కుడి చేతి బొటన వేలి గాయం కారణంగా ఈ వామప్ మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

