IND vs SL వామప్ మ్యాచ్.. భారత్ ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!
శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(164 బంతుల్లో 18 ఫోర్లతో 142 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(117 బంతుల్లో 7 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు.
మానవ్ సుతార్(90 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 41), సరాన్ష్ జైన్(22), గుర్నూర్ బ్రార్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో రమేష్ మెండీస్, అసంక మనోజ్ రెండేసి వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువాంత తలో వికెట్ తీసారు. భారత్ ఇంకా శ్రీలంక కంటే 6 పరుగుల వెనుకంజలో ఉంది.

నిరాశపర్చిన రాహుల్, జైస్వాల్..
రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్(0).. దిలుమ్ సుదీర్‌కు క్యాచ్ ఇచ్చి సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. వైడ్‌బాల్‌ను వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు, దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడి రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్(40)ను నువాంత క్లీన్ బౌల్డ్ చేశాడు.
రవీంద్ర జడేజా సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ మరుసటి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి రిషభ్ పంత్ వచ్చాడు. కానీ అతను ఐదు బంతుల్లో 2 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ కూడా ఆ కాసేపటికే క్యాచ్ ఔటయ్యాడు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ రమేష్ మెండీస్ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 174 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న జడేజా, సుతార్..
ఈ పరిస్థితుల్లో జడేజా, మానవ్ సుతార్ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ అనంతరం రవీంద్ర జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. కుల్దీప్ యాదవ్(1) గాయంతో తప్పుకున్నాడు. మహమ్మద్ సిరాజ్(1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సరాన్ష్ జైన్(22) పరుగుల తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. దేవదత్ పడిక్కల్ తిరిగిన బ్యాటింగ్‌కు వచ్చాడు. గుర్నూర్ బ్రార్‌తో కలిసి అతను రెండో రోజు ఆటను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

