Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ఇదేం షాట్ రా అయ్యా.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! (వీడియో)

IND vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ(4) వెనుదిరిగినా.. సాధికారిక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

రెండో వికెట్‌కు కోహ్లీ, గిల్ 193 పరుగులు జోడించారు. అయితే ఈ ఇద్దరూ సెంచరీలు చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నారు. శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92) 8 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకోగా.. విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88) శతకానికి 12 పరుగుల దూరంలో ఔటయ్యాడు.

IND vs SL, World Cup 2023: Virat Kohlis reaction to Shubman Gills incredible shot goes viral

ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఆడిన ఓ షాట్‌కు విరాట్ కోహ్లీ నోరెళ్లబెట్టాడు. 'ఇదేం షాట్ రా అయ్యా'అంటూ అవాక్కయ్యాడు. మధుషంక వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని శుభ్‌మన్ గిల్ ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా బౌండరీకి తరలించాడు. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న కోహ్లీ (Virat Kohli) 'వారెవ్వా వాటే షాట్'అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఇద్దరూ ఔటైన అనంతరం కేఎల్ రాహుల్‌(21)తో కలిసి నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించిన శ్రేయస్ అయ్యర్.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సూర్యకుమార్ ఔటైనా.. భారీ సిక్సర్లు బాదిన అయ్యర్.. జడేజాతో కలిసి జట్టు స్కోర్‌ను 300 ధాటించాడు. సెంచరీ దిశగా సాగుతున్న అయ్యర్.. జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు.

Story first published: Thursday, November 2, 2023, 17:55 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+