Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

IND vs SL, World Cup 2023: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే చరిత్రలోనే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 8 క్యాలండర్ ఇయర్స్‌లో కోహ్లీ 1000కి పైగా పరుగులు చేశాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. సచిన్ ఏడు క్యాలండర్ ఇయర్స్‌లో వెయ్యికి పైగా రన్స్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత సౌరవ్ గంగూలీ(6), సంగక్కర(6), రికీ పాంటింగ్(6), రోహిత్ శర్మ(4) ఉన్నారు.

IND vs SL, World Cup 2023:Virat Kohli breaks Sachin Tendulkar’s record of most 1000-run years in ODIs

విరాట్ కోహ్లీ 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2023లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 1994, 1996,1997, 1998, 2000, 2003, 2007లో వెయ్యికి పైగా రన్స్ చేశాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ బాదిన కోహ్లీ.. న్యూజిలాండ్‌పై 95 రన్స్ చేశాడు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీలతోరాణించాడు. పాకిస్థాన్‌తో 16 పరుగులే చేసిన కోహ్లీ.. ఇంగ్లండ్‌తో డకౌట్‌గా వెనుదిరిగాడు.

శ్రీలంకతో ఆరంభంలోనే విరాట్ కోహ్లీకి లైఫ్ లభించింది. దుష్మంత చమీర బౌలింగ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ అది సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో చమీరకు ఎడమ వైపు క్యాచ్‌ వచ్చింది. దాన్ని అందుకోబోయిన చమీర.. బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతి అతని చేతిలో నుంచి జారీ పోయింది. దాంతో కోహ్లీతో పాటు భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అవకాశంతో చెలరేగిన కోహ్లీ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. గిల్ కూడా 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Thursday, November 2, 2023, 15:47 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+