For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: కోహ్లీ, గిల్, అయ్యర్ విధ్వంసం.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే..?

IND vs SL, World Cup 2023‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది.

శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. దుష్మంత్ చమీరాకు ఓ వికెట్ దక్కింది.

IND vs SL, World Cup 2023: Shubman Gill, Virat Kohli and Shreyas Iyer power India to 357/8

రోహిత్ ఔటైనా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఫస్ట్ ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. బౌండరీతో ఆటను ప్రారంభించిన రోహిత్ శర్మ(4) మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.

ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన ఈ జోడీ శ్రీలంక బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌లను లంక ఆటగాళ్లు వదిలేసారు. ఈ అవకాశాలతో చెలరేగిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. 50 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. శుభ్‌మన్ గిల్ 55 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు.

చెలరేగిన గిల్, కోహ్లీ
హాఫ్ సెంచరీల అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ సెంచరీల దిశగా సాగింది. 193 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీ మధుషంక విడదీసాడు. సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో కోహ్లీని క్యాచ్ ఔట్ చేసి అతని సెంచరీని అడ్డుకున్నాడు.

సిక్సర్ల అయ్యర్..
క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో కలిసి భారీ సిక్సర్లు బాదాడు. దూకుడుగా ఆడిన అయ్యర్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(21)ను దుష్మంత్ చమీరా ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్య(12) విఫలమైనా.. జడేజాతో కలిసి అయ్యర్ చెలరేగాడు.

భారీ సిక్సర్లతో సెంచరీ దిశగా సాగిన అతన్ని మధుషంక క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. షమీ(2)తో కలిసి జడేజా జట్టు స్కోర్‌ను 350 ధాటించాడు.

Story first published: Thursday, November 2, 2023, 18:12 [IST]
Other articles published on Nov 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+