For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: వరల్డ్ కప్‌లోనే భారీ సిక్సర్ (వీడియో)

IND vs SL, World Cup 2023: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే రికార్డు నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారీ సిక్సర్ బాదాడు. శ్రీలంకతో వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అయ్యర్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరగ్గా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 104 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు ఇదే భారీ సిక్సర్‌గా ఉండగా.. తాజాగా శ్రేయస్ అయ్యర్ 106 మీటర్ల సిక్స్‌తో అధిగమించాడు. భారత ఇన్నింగ్స్ 36వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాసున్ రజిత వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని అయ్యర్.. లాంగాన్ మీదుగా సిక్సర్ తరలించాడు.

 IND vs SL, World Cup 2023: Shreyas Iyer hits biggest six against Kasun Rajitha for 106m monster

అతని హ్యాండ్ పవర్‌కు బంతి 106 మీటర్ల దూరంలో పడింది. ప్రస్తుతం ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయ్యర్ కొట్టిన భారీ సిక్సర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయ్యర్‌తో అట్లుంటదని కామెంట్ చేస్తున్నారు.

ఈ టోర్నీలో భారీ సిక్సర్ల జాబితాలో అయ్యర్(106 మీటర్లు) అగ్రస్థానంలో ఉండగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్(104 మీటర్లు0, శ్రేయస్ అయ్యర్(101 మీటర్లు), ఫకార్ జమాన్(99 మీటర్లు), డేవిడ్ వార్నర్(98 మీటర్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ మ్యాచ్ ముందు వరకు పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అయ్యర్.. అదిరిపోయే బ్యాటింగ్‌తో సమాధానం చెప్పాడు. షార్ట్ పిచ్ బాల్ బలహీనతను అధిగమిస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 56 బంతుల్లో 82 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్న అయ్యర్.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో వీర విహారం చేశాడు.

శ్రేయస్ అయ్యర్‌తో పాటు శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. దుష్మంత్ చమీరాకు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, November 2, 2023, 18:59 [IST]
Other articles published on Nov 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+