Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్.. తల్లడిల్లిన సారా టెండూల్కర్!

IND vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ హాజరైంది. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ(4) విఫలమైనా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నారు.

ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శతకాల దిశగా సాగారు. ఇక శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను సారా టెండూల్కర్ తెగ ఎంజాయ్ చేసింది. ఈ మ్యాచ్‌కు సారా హాజరవ్వడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు వచ్చిందని ఆరోపిస్తున్నారు.

IND vs SL, World Cup 2023: Sara Tendulkar In Attendance To Watch Shubman Gill In Action At Wankhede

సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మధ్యలో సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ తిరుగుతున్నాడని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ముంబైలోని జియో ప్లాజ్ ఓపెనింగ్ కార్యక్రమానికి గిల్, సారా టెండూల్కర్ హాజరవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమాయణం చర్చనీయాంశమైంది.

పబ్లిగ్గానే ఈ ఇద్దరు కలిసి తిరుగుతుండటంతో వీరి మధ్య ప్రేమాయణం నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక మ్యాచ్‌కు సారా టెండూల్కర్ హాజరవ్వడం చర్చనీయాంశమైంది. సారా టెండూల్కర్‌ ముందు శుభ్‌మన్ గిల్ రెచ్చిపోయాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సెంచరీ దిశగా సాగిన శుభ్‌మన్ గిల్(92) మధుషంక ఔట్ చేశాడు.

IND vs SL, World Cup 2023: Sara Tendulkar In Attendance To Watch Shubman Gill In Action At Wankhede

శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌కు సారా టెండూల్కర్‌తో పాటు ముంబై ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మరోవైపు అభిమానులు మాత్రం గిల్ సెంచరీ చేజార్చుకోవడాన్ని సారా టెండూల్కర్ తట్టుకోలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు.

గిల్ ఔటైనా కాసేపటికే విరాట్ కోహ్లీ(88) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మధుషంక బౌలింగ్‌లోనూ పెవిలియన్ చేరి మరోసారి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కోహ్లీ ఔటవ్వడంతో టీమిండియా 193 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్ ఉన్నారు.

Story first published: Thursday, November 2, 2023, 16:47 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+