Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా!

IND vs SL, World Cup 2023: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బంతికే వికెట్ తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు తొలి బంతికే జస్‌ప్రీత్ బుమ్రా దిమ్మతిరిగే షాకిచ్చాడు.

ఓపెనర్ పాతుమ్ నిస్సంక(0)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ నిర్ణయాన్ని పాతుమ్ నిస్సంక సవాల్ చేయగా.. రివ్యూలో అంపైర్స్ కాల్ అని తేలింది. దాంతో నిస్సంక గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. తదుపరి ఓవర్ వేసిన సిరాజ్.. రెండు వికెట్లతో శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసాడు.

 IND vs SL, World Cup 2023: Jasprit Bumrah script history, take a wicket on the first ball of the innings

సిరాజ్ స్వింగ్ బాల్‌కు దిముత్ కరుణరత్నే‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నిర్ణయాన్ని అతను సవాల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. క్రీజులోకి వచ్చిన సమరవిక్రమాను ఇదే ఓవర్ ఐదో బంతికి సిరాజ్ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. మెయిడిన్ ఓవర్‌తో పాటు రెండు వికెట్లు తీసిన సిరాజ్.. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌ను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ 6 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.

సిరాజ్ దెబ్బకు 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైంది. దాంతో జస్‌ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్‌లో సింగిల్ మాత్రమే వచ్చింది. నాలుగో ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతికే మెండీస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో శ్రీలంక 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

9వ ఓవర్‌లో మహమ్మద్ షమీని రంగంలోకి దించిన రోహిత్ శర్మ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. షమీ వేసిన 10వ ఓవర్‌లో వరుస బంతుల్లో చరిత్ అసలంక(1), దుషాన్ హేమంత(0) పెవిలియన్ చేరారు. షమీ వేసిన మరుసటి ఓవర్‌లో దుష్మంత్ చమీరా(0) కూడా ఔటవ్వడంతో శ్రీలంక ఆలౌట్‌కు 2 వికెట్ల దూరంలో నిలిచింది.

అంతకు ముందు టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. దుష్మంత్ చమీరాకు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, November 2, 2023, 20:27 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+