Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి నయా ఆల్‌రౌండర్? ఎవరీ సౌరభ్ కుమార్?

Who is Saurabh Kumar

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగనున్న అప్‌కమింగ్ టీ20, టెస్ట్ సిరీస్‌లకు సంబంధించిన జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన వేర్వేరు జట్ల వివరాలను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. సీనియర్ ఆటగాళ్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలపై వేటు వేసిన సెలెక్షన్ కమిటీ అనూహ్యంగా ఉత్తర ప్రదేశ్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌ను ఎంపిక చేసింది. గత కొంతకాలంగా డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సౌరభ్ కుమార్‌ టీమిండియా పిలుపు అందుకోవడం ఇదే తొలిసారి.

దాంతో జట్టులో అతని పేరు చూసిన అభిమానులంతా షాకయ్యారు. ఎవరీ? సౌరభ్ కుమార్ అని ఆరా తీస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌‌కు చెందిన సౌరభ్
ఇప్పటి వరకు 46 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 25 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సౌరభ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 46 మ్యాచ్‌లు ఆడిన సౌరభ్.. 196 వికెట్లు పడగొట్టాడు.

ఈ లెప్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌.. గత ఏడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికాలో పర్యటించిన భారత-ఏ జట్టులో భాగమై ఉన్నాడు. అదే విధంగా గతేడాది జరగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోను సౌరభ్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఇక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 44 వికెట్లతో పాటు, 285 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో కుల్ధీప్‌ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు.

జట్టులో రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ ఉన్న నేపథ్యంలో సౌరభ్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. కానీ అశ్విన్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో సౌరభ్ కుమార్‌ను బ్యాకప్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత టెస్ట్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహరి, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్)

Story first published: Saturday, February 19, 2022, 21:58 [IST]
Other articles published on Feb 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+