Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X శ్రీలంక తొలి టెస్ట్‌కు భారీ అడ్డంకి!

భారత టెస్ట్ టీమ్ చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌‌లో భాగంగా శనివారం గాలే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇది టెస్ట్‌ల్లో టీమిండియాకు 600వ మ్యాచ్‌ కావడం విశేషం. స్వాతంత్ర్యదినోత్సవం నాడే ఈ మ్యాచ్ ప్రారంభమవుతుండటం మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం. డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయాలి. దాంతోనే విజయమే లక్ష్యంగా శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగుతోంది. శ్రీలంక కండిషన్స్‌కు అలవాటు పడేందుకు 10 రోజుల ముందే అక్కడికి వెళ్లి సన్నదమైంది. వామప్ మ్యాచ్ కూడా ఆడి గెలిచింది.

IND vs SL Weather Update Rain May Interrupt India s Landmark 600th Test in Galle

అయితే తొలి టెస్ట్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వర్షం కారణంగా గాలే వేదికగా టీమిండియా సన్నాహకాలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం కూడా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి టెస్ట్ జరిగే ఐదు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం గాలేలో వాతావరణం మేఘావృతమై, చల్లని గాలులు వీచడంతో పాటు చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. ఉష్ణోగ్రతలు 30-31°C మధ్య ఉండే అవకాశం ఉండగా.. గాలిలో తేమ కారణంగా ఉక్కపోత‌తో ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. శనివారం ఉదయం 90 శాతం వర్షం పడే అవకాశం ఉంది. 5.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. గంటకు సుమారు 20-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రెండో రోజైన ఆదివారంతో పాటు తర్వాతి సోమవారం, మంగళవారం, బుధవారాల్లో కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దాంతో మ్యాచ్‌కు పదే పదే అంతరాయం ఏర్పడవచ్చు.

2017లో చివరిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా.. కోహ్లీ సారథ్యంలో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గాలేలో చివరిసారిగా జరిగిన టెస్ట్‌లో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

Story first published: Friday, August 14, 2026, 17:52 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+