Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంకతో వామప్ మ్యాచ్.. ఖాతా తెరిచిన సిరాజ్, ప్రసిధ్ .. బరిలోకి దిగిన అకిబ్ నబీ!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. మూడో రోజు ఆటలో టీమిండియా పేసర్లు ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఎట్టకేలకు వికెట్లు తీసారు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయిన ఈ ఇద్దరూ మూడో రోజు ఆట ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు.

IND vs SL: గాయంతో సాయి సుదర్శన్ ఔట్.. రేసులో తెలుగోడు!

IND vs SL: గాయంతో సాయి సుదర్శన్ ఔట్.. రేసులో తెలుగోడు!

తొలిసారి టీమిండియాకు ఎంపికైన జమ్మూ కశ్మీర్ పేస్ సెన్సేషన్ అకిబ్ నబీదార్ కూడా ఎట్టకేలకు బౌలింగ్ చేశాడు. అయితే అతను వేసిన తొలి ఐదు ఓవర్లలో ఒక్క వికెట్ దక్కలేదు. గుర్నూర్ బ్రార్ కూడా ఒక వికెట్ తీయడంతో శ్రీలంక ఎలెవన్ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

IND vs SL Warm-Up Mohammed Siraj and Prasidh Krishna Strike as Auqib Nabi Gets a Chance to Bowl

357/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్..అదే స్కోర్ వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్(164 బంతుల్లో 18 ఫోర్లతో 142 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(117 బంతుల్లో 7 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(90 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 41), సరాన్ష్ జైన్(22), గుర్నూర్ బ్రార్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో రమేష్ మెండీస్, అసంక మనోజ్ రెండేసి వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువాంత తలో వికెట్ తీసారు.

6 పరుగుల స్వల్ప ఆధిక్యంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. సిరాజ్ వేసి ఐదో ఓవర్‌లో రవిందు రసంత(8) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8వ ఓవర్‌లో పసిందు సూరియబండార(4)‌ను ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు.

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్‌ను ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!

Also Read

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్‌ను ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!

19వ ఓవర్‌లో పవన్ రత్నాయకే(16)ను గుర్నూర్ బ్రార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో(63 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంజలా బండార(15 బ్యాటింగ్)తో కలిసి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ వామప్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 15న మొదలవ్వనుంది. రెండో టెస్ట్ ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది.

Story first published: Sunday, August 9, 2026, 12:19 [IST]
Other articles published on Aug 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+