Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్ లక్ష్యం 207! మిగిలింది 45 ఓవర్ల ఆటే!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నమోదైంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఎలెవన్ 45 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

నిషాన్ ఫెర్నాండో(73 బంతుల్లో 10 ఫోర్లతో 63), నిపున్ ధనంజయ(56 బంతుల్లో 5 ఫోర్లతో 46), అంజల బండార(48 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీయగా.. గుర్నూర్ బ్రార్(2/37), రవీంద్ర జడేజా(2/33) రెండేసి వికెట్లు తీసారు.

IND vs SL: శ్రీలంకతో వామప్ మ్యాచ్.. ఖాతా తెరిచిన సిరాజ్, ప్రసిధ్ .. బరిలోకి దిగిన అకిబ్ నబీ!

IND vs SL: శ్రీలంకతో వామప్ మ్యాచ్.. ఖాతా తెరిచిన సిరాజ్, ప్రసిధ్ .. బరిలోకి దిగిన అకిబ్ నబీ!

దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నమోదైంది. అయితే ఈ లక్ష్యం ఛేదించదగినదే. శ్రీలంక ఎలెవన్ 45 ఓవర్లలో 200 పరుగులు చేసినప్పుడు భారత్ ఈజీగా లక్ష్యం ఛేదించవచ్చు. కానీ భారత్ ఈ సవాల్‌ను ఎలా స్వీకరిస్తుందో చూడాలి.

IND vs SL Warm-Up Day 3 Sri Lanka Set India 207-Run Target After Declaring at 200
Photo Credit: BCCI(X)

లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుందా? లేక ఆచితూచి ఆడి డ్రా చేసుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నంగా మారింది. బౌలర్లకు అయితే ఈ వామప్ మ్యాచ్‌తో మంచి ప్రాక్టీస్ లభించింది. బ్యాటర్లు కూడా ఈ 45 ఓవర్లను సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. నిషాన్ ఫెర్నాండో(65 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 66), రావిందు రసంతా(143 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), కెప్టెన్ సోనాల్ దినుషా(72 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/64), కుల్దీప్ యాదవ్(2/76), మానవ్ సుతార్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయారు.

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్‌ను ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!

Also Read

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్‌ను ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!

అనంతర భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దేవదత్ పడిక్కల్(164 బంతుల్లో 18 ఫోర్లతో 142 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(117 బంతుల్లో 7 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(90 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 41), సరాన్ష్ జైన్(22), గుర్నూర్ బ్రార్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో రమేష్ మెండీస్, అసంక మనోజ్ రెండేసి వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువాంత తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, August 9, 2026, 14:35 [IST]
Other articles published on Aug 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+