Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: మొత్తానికి అయ్యగారూ బరిలోకి దిగారు.. క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కుడి చేతి బొటన వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించాడు. ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా సాగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆఖరి రోజు బ్యాటింగ్‌కు దిగాడు.

207 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన యశస్వి జైస్వాల్.. ఈ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

అందుకే భారత్ X శ్రీలంక వామప్ మ్యాచ్‌‌కు శుభ్‌మన్ గిల్ దూరం: బీసీసీఐ

అందుకే భారత్ X శ్రీలంక వామప్ మ్యాచ్‌‌కు శుభ్‌మన్ గిల్ దూరం: బీసీసీఐ

అయ్యగారు అదరగొట్టారు..

మరోవైపు శుభ్‌మన్ గిల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన అతన్ని నువాంత క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 54 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది.

IND vs SL Warm-Up Day 3 Shubman Gill returns to bat after injury scare Misses Half Century

భారత్ విజయానికి మరో 24 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రిషభ్ పంత్(6 బ్యాటింగ్), ధ్రువ్ జురెల్(1 బ్యాటింగ్) ఉన్నారు. ఇదే జోరును భారత్ కొనసాగిస్తే సునాయస విజయాన్ని అందుకోనుంది. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయ్యగారూ బరిలోకి దిగారు.. క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టారనే క్యాప్షన్స్ ఇస్తున్నారు.

పడిక్కల్ శతకం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. నిషాన్ ఫెర్నాండో(65 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 66), రావిందు రసంతా(143 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), కెప్టెన్ సోనాల్ దినుషా(72 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/64), కుల్దీప్ యాదవ్(2/76), మానవ్ సుతార్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయారు.

అనంతర భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దేవదత్ పడిక్కల్(164 బంతుల్లో 18 ఫోర్లతో 142 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(117 బంతుల్లో 7 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(90 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 41), సరాన్ష్ జైన్(22), గుర్నూర్ బ్రార్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో రమేష్ మెండీస్, అసంక మనోజ్ రెండేసి వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువాంత తలో వికెట్ తీసారు.

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్ లక్ష్యం 207! మిగిలింది 45 ఓవర్ల ఆటే!

Also Read

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్ లక్ష్యం 207! మిగిలింది 45 ఓవర్ల ఆటే!

భారత్ లక్ష్యం 207

శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నిషాన్ ఫెర్నాండో(73 బంతుల్లో 10 ఫోర్లతో 63), నిపున్ ధనంజయ(56 బంతుల్లో 5 ఫోర్లతో 46), అంజల బండార(48 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీయగా.. గుర్నూర్ బ్రార్(2/37), రవీంద్ర జడేజా(2/33) రెండేసి వికెట్లు తీసారు. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నమోదైంది.

Story first published: Sunday, August 9, 2026, 16:26 [IST]
Other articles published on Aug 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+