IND vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ హాజరవ్వడం చర్చనీయాంశమైంది. శుభ్‌మన్ గిల్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది.
జాతీయ మీడియా, సోషల్ మీడియా.. ఈ ఇద్దరూ లవ్ బర్డ్స్ అంటూ ప్రచారం చేస్తున్నా.. అటు సచిన్ ఫ్యామిలీ కానీ.. శుభ్‌మన్ గిల్ కానీ ఖండించలేదు. అంగీకరించలేదు. మౌనంగా ఉండటంతో వీరి ప్రేమాయణం నిజమేనని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు రోజు ముంబైలోని జియో ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ హాజరయ్యారు.

ఈ ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే శ్రీలంకతో మ్యాచ్‌కు సారా టెండూల్కర్ హాజరవ్వడం.. శుభ్‌మన్ గిల్‌కు మద్దతు తెలపడం ఈ లవ్ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చింది. గిల్ శతకం చేజార్చుకున్నప్పుడు సారా బాధపడటం కూడా నెట్టింట వైరల్ అయ్యింది.
శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ కొనియాడుతూ ప్రేక్షకులతో పాటు సారా టెండూల్కర్ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కొందరు అభిమానులు సారా.. సారా అని అరుస్తూ శుభ్‌మన్ గిల్‌ను టీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ అరుపులతో ఆగ్రహానికి గురైన కోహ్లీ.. ఫ్యాన్స్ వైపు కోపంగా చూశాడు.
పక్కనే ఉన్న శుభ్‌మన్ గిల్ దగ్గరికి వెళ్లి అతని జెర్సీపై ఉన్న పేరు చూపించాడు. సారా అని కాకుండా శుభ్‌మన్ గిల్ అని ఛీర్ చేయాలని సూచించాడు.
కోహ్లీ రియాక్షన్‌ను ప్రేక్షకులు తమ ఫోన్లో రికార్డు చేయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇదే మ్యాచ్‌లో బౌలింగ్ చేయాలంటూ ఫ్యాన్స్ అరవగా.. కోహ్లీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు.
'మీకో దండంరా సామీ'అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయినా అలానే అరవడంతో తన బౌలింగ్ యాక్షన్ చూపించి వారిని సంతృప్తిని పరిచాడు. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీస్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆదివారం కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.